Iran – Israel: ఈ ఇరాన్ దీవిపై దాడి జరిగితే పెట్రో సంక్షోభమే.! వీడియో..
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయడంతో ఇజ్రాయెల్ భగ్గుమంటోంది. ప్రతీకారదాడులు తప్పవని అంటోంది. ఇప్పటికే ప్రధాని నెతన్యాహు సైనిక అధికారులతో సమావేశమై వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఇరాన్ కూడా తమపై దాడి జరిగితే తిప్పికొడతామని హెచ్చరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్‌కు మద్దతు పలికారు.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయడంతో ఇజ్రాయెల్ భగ్గుమంటోంది. ప్రతీకారదాడులు తప్పవని అంటోంది. ఇప్పటికే ప్రధాని నెతన్యాహు సైనిక అధికారులతో సమావేశమై వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఇరాన్ కూడా తమపై దాడి జరిగితే తిప్పికొడతామని హెచ్చరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్‌కు మద్దతు పలికారు. అయితే ఇరాన్‌లోని అణుకేంద్రాలపై దాడి వద్దని సూచించారు. అటు మధ్యధరా సముద్రంలోనూ, పర్షియన్ గల్ప్‌లోనూ అమెరికా యుద్ధదళాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఈ అంశంపై అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు జయప్రకాశ్ అంకం ఏం చెప్పారంటే..
పర్షియన్ గల్ప్‌లోని ఇరాన్ తీరానికి 25 కి.మీ.దూరంలో ఉన్న ఖర్గ్ అనే చిన్నదీవి ఇరాన్‌కు ఆయువుపట్టు. ఇక్కడ నుంచే భారీ ఎత్తున పెట్రో ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రపంచంలో పెద్ద దిగుమతిదారుగా ఉన్న చైనాకు ఇక్కడ నుంచి సరఫరా జరుగుతుంది. దీనిని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటే దాడి జరిగిన వెంటనే ఒక్కసారిగా 5 శాతం చమురుధరలు పెరుగుతాయని అంతర్జాతీయ చమురుసంస్థల అంచనా. గతంలో ఇరాన్-ఇరాక్ యుద్ధంలోనూ సద్దాంహుస్సేన్ సేనలు ఈ దీవిపై దాడులు జరిపాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.