Petrol Prices: వాహనదారులకు గుడ్ న్యూస్.. దేశంలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.! వివరాలివే..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరికొద్ది రోజుల్లో తగ్గనున్నాయని ప్రముఖ జాతీయ సంస్థ ఐఏఎన్‌ఎస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు..

Petrol Prices: వాహనదారులకు గుడ్ న్యూస్.. దేశంలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.! వివరాలివే..
Petrol And Diesel Price

Edited By:

Updated on: Jul 21, 2021 | 3:42 PM

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరికొద్ది రోజుల్లో తగ్గనున్నాయని ప్రముఖ జాతీయ సంస్థ ఐఏఎన్‌ఎస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో.. దాని ప్రభావం దేశంలోని ఇంధన ధరలపై పడింది. దీనిపై ఇప్పటికే చమురు సంస్థలు దృష్టి సారించాయి.

ఐఏఎన్‌ఎస్ ఇచ్చిన నివేదిక ప్రకారం..

  • గత నెల చివరిలో క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 77 యూఎస్ డాలర్లకు పెరిగింది. అది కాస్తా గడిచిన రెండు వారాల్లో 10 శాతానికి పైగా తగ్గిందని ఐఏఎన్ఎస్ నివేదిక పేర్కొంది.
  • ప్రస్తుత ధర ఇప్పుడు బ్యారెల్‌కు 68.85 యూఎస్ డాలర్లుగా ఉంది. మరికొన్ని రోజులు ఈ ధర 70 డాలర్ల కంటే దిగువన ఉంటే.. ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ రేట్లు రాబోయే రోజుల్లో తగ్గుముఖం పడతాయని ఐఏఎన్ఎస్ నివేదించింది.
  • ఇప్పటికే దేశంలోని ఇంధన ధరలపై ఆ ప్రభావం పడింది. చమురు సంస్థలు బుధవారం పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. గత నాలుగు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతుండటానికి ఇదే కారణం.
  • ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను ఒకసారి పరిశీలిస్తే.. పెట్రోల్ లీటరు రూ.101.84 ఉండగా.. డీజిల్ లీటరు రూ .89.87గా ఉంది.
  • ఆదివారం నుండి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అటు గత శనివారం పెట్రోల్‌పై 30 పైసలు పెంచగా.. డీజిల్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
  • ఆర్ధిక రాజధాని ముంబై నగరంలో మే 29న తొలిసారిగా పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటింది. ముంబైలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.107.83గా ఉంది. డీజిల్ ధర రూ. 97.45గా కొనసాగుతోంది. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే.. ఇక్కడే ఇంధన ధరలు అత్యధికం.
  • అన్ని మెట్రో నగరాల్లోనూ పెట్రోల్ ధర రూ .100 మార్క్ దాటింది. కానీ గత నాలుగు రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది.
  • రోజువారీ ధరల సవరణలో, OMCలు ప్రతి ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి. రిటైల్ ఇంధన ధరలను, అంతర్జాతీయ చమురు ఉత్పత్తుల ధరలు, డాలర్ మార్పిడి రేటును 15 రోజుల రోలింగ్ సగటును బెంచ్ మార్క్‌గా తీసుకుని రేట్లను నిర్దేశిస్తాయి. మరోసారి ఆ 15 రోజుల బెంచ్ మార్క్ వస్తే.. ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడతాయి.

Also Read:

మీ పర్సులో డబ్బులు నిలవాలంటే.. ఈ వస్తువులు ఉంచుకోకూడదు.! అవేంటంటే..

పాము, ముంగీస మధ్య హోరాహోరీ ఫైట్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే.!

ఓర్నీ దుంపతెగ.! పులికి ఎదురెళ్లి ‘హలో బ్రదర్’ చెప్పాడు.. క్రేజీ వీడియో వైరల్..

డెబ్యూ మ్యాచ్‌లో 19 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. సిక్సర్లు, ఫోర్లతో 202 స్ట్రైక్‌రేట్.!

అందరూ చూస్తుండగా వధూవరుల ముద్దులాట.. వీడియో చూసి తీరాల్సిందే.!

ఈ రాశివారికి అన్నింటా విజయాలే.. బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.!