AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఈలలతో పొరిగింటి వ్యక్తికి చికాకు తెప్పించిన రామచిలుక.. పక్షి యజమానిపై పోలీసులకు ఫిర్యాదు

తన పొరుగింట్లోని రామ చిలుక చేసే సందడి.. అల్లరి ఓ వ్యక్తికీ నచ్చలేదు.. దీంతో నేను రామ చిలుక అరుపులను భరించలేకపోతున్నాను బాబోయ్ అంటూ పోలీసు గడప ఎక్కాడు..యజమానిపై ఫిర్యాదు చేశాడు.

Viral News: ఈలలతో పొరిగింటి వ్యక్తికి చికాకు తెప్పించిన రామచిలుక.. పక్షి యజమానిపై పోలీసులకు ఫిర్యాదు
Parrot Whistles
Surya Kala
|

Updated on: Aug 08, 2022 | 8:30 AM

Share

Police Case On Parrot Owner: కుక్కలను, పిల్లుల్ని పెంచుకోవడానికి ఎంతగా ఇష్టపడతారో.. పక్షుల్లో రామచిలుకని కూడా అంతే ఇష్టంగా పెంచుకుంటారు. కొంతమంది తాము పెంచుకునే చిలుక.. మనిషిలా మాట్లాడం కూడా నేర్పి.. సంతోషపడుతూ ఉంటారు. అందంతోనే కాదు.. మనిషిని అనుకరిస్తూ.. మాట్లాడే విధానంతో రామ చిలుక మనుషులకు అత్యంత ఇష్టమైన పెంపుడు పక్షిగా మారింది. దాని ముద్దు ముద్దు మాటలను వినడమే కాదు.. వీలుంటే దానిని ఓసారి చేతిలోకి తీసుకుని ముద్దాడాలని భావిస్తారు. కొంతమంది ఈ పక్షిని తమ ఇంట్లో ఎంతో గారాబంగా చూసుకుంటారు. ఇంట్లో చిన్న పిల్లలా భావించి దాని అరుపులు, చేష్టలను చూసి మురిసిపోతుంటారు. అయితే తన పొరుగింట్లోని రామ చిలుక చేసే సందడి.. అల్లరి ఓ వ్యక్తికీ నచ్చలేదు.. దీంతో నేను రామ చిలుక అరుపులను భరించలేకపోతున్నాను బాబోయ్ అంటూ పోలీసు గడప ఎక్కాడు..యజమానిపై ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

పూణే నగరంలో శివాజీ నగర్ ప్రాంతంలో చిలుక అరుపులు తనకు చికాకుని తెప్పిస్తున్నాయని పిర్యాదు రావడంతో.. ఆ పక్షియజమానిపై కేసు బుక్  చేశారు పోలీసులు. ఈ విచితమైన సంఘటన ఆగష్టు 7  జరిగింది. శివాజీ నగర్ ప్రాంతంలో సురేశ్​ శిందే అనే 72 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సురేష్ పక్క ఇంట్లో అక్బర్ అంజద్​ ఖాన్​ నివాసం ఉంటున్నాడు. అక్బర్ ఓ రామచిలుకను పెంచుకుంటున్నాడు. అయితే ఈ పెంపుడు చిలుక ఎప్పడూ అరుస్తూనే ఉందని.. దీనిని ఈలలను తనకు భరించలేకపోతున్నానంటూ.. సురేశ్​ శిందే  ఖడ్కి పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అతనికి హామీనిచ్చారు.

నగరంలోని పాటిల్ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన అక్బర్ అంజద్​ ఖాన్​ పెంపుడు చిలుక ఈలలు వేస్తుండడంతో సురేష్ ఆ పక్షిని వేరే చోట పెట్టమని ఖాన్‌ను కోరినట్లు పోలీసులు చెప్పారు. అయితే పక్షిని వేరే చోట తరలించమని కోరడంతో అక్బర్.. సురేష్ ని దుర్భాషలాడాడని తెలిపారు. చివరకు చిలుక విజిల్స్‌తో విసిగిపోయిన షిండే, పెంపుడు జంతువు యజమానిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. సంబంధిత చట్టాలకు అనుగుణంగా.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..