PM Modi: దగ్గరపడుతున్న వార్షిక పరీక్షలు.. ప్రధాని మోడీ ‘పరీక్షా పే చర్చ’కు డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

|

Jan 04, 2023 | 12:29 PM

పరీక్షల సమయం దగ్గరపడుతోంది. ఈ సమయంలో విద్యార్థులు ఒత్తిడి, భయానికి లోనవుతారు. ఈ సందర్భంగా విద్యార్థులలో ఉన్న పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..

PM Modi: దగ్గరపడుతున్న వార్షిక పరీక్షలు.. ప్రధాని మోడీ ‘పరీక్షా పే చర్చ’కు డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?
Pm Modi
Follow us on

పరీక్షల సమయం దగ్గరపడుతోంది. ఈ సమయంలో విద్యార్థులు ఒత్తిడి, భయానికి లోనవుతారు. ఈ సందర్భంగా విద్యార్థులలో ఉన్న పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి తేదీ ఖరారైంది. ఈ నెల 27న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సంభాషించనున్నారు. న్యూఢిల్లీలోని తల్కతోరా ఇండోర్ స్టేడియంలో వార్షిక “పరీక్షా పే చర్చా” (PPC 2023) కార్యక్రమాన్ని నిర్వహిస్తారని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఈ ఏడాది పరీక్షలు రాయనున్న విద్యార్థులతో మోడీ ప్రత్యేకంగా సంభాషించి వారి ప్రశ్నలను నివృత్తి చేసి.. వారిలో ఉన్న ఒత్తిడి భయాన్ని దూరం చేసి ధైర్యం నింపుతారని పేర్కొంది. ఈ కార్యక్రమంలో 9 నుంచి12 తరగతుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొననున్నారు.

ప్రధాని మోడీ పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు తొమ్మిది నుంచి 12 తరగతులు చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రిజిస్టర్‌ చేసుకొనేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 30వరకు అవకాశం కల్పించింది. MyGovలో పలు పోటీలు నిర్వహించి.. ఆ పోటీల్లో ఎంపికైన సుమారు 2,050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఎంపిక చేసినట్లు విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. హాజరయ్యే వారికి పీపీసీ కిట్‌లను బహుమతిగా అందజేయనున్నారు. పాల్గొనే వారినే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ప్రశ్నల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేశారు.

ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రధాని మోడీ 2018 ఫిబ్రవరి 16న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టి, పలు అంశాలపై వారు అడిగే సందేహాలను నివృత్తి చేస్తుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..