Oxygen Cylinders Looted: కరోనా కలకలం.. ఆక్సిజన్ సిలిండర్ల లూటీ.. రంగంలోకి దిగిన కలెక్టర్, పోలీసులు
Oxygen Cylinders Looted: దేశంలో కరోనా కేసులు మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని రోజుల నుంచి నిత్యం రెండు లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో
Oxygen Cylinders Looted: దేశంలో కరోనా కేసులు మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని రోజుల నుంచి నిత్యం రెండు లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా బాధితుల పరిస్థితి విషమిస్తుండటతో ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అయినప్పటికీ రోగులను మృత్యువు ఏదో ఒక విధంగా వెంటాడుతూనే ఉంది. దేశంలో చాలాచోట్ల ఆక్సిజన్ లేక రోగులు మరణిస్తున్నారు. దీంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే ఔషధం రెమిడెసివిర్ కూడా లభించడం లేదు. ఇప్పటికే ఆక్సిజన్ లేక పదుల సంఖ్యలో కరోనా బాధితులు మరణించారు. ఈ నేపధ్యంలో చాలామంది ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్‌లో అమ్ముకుంటుండగా.. మరికొంతమంది లూటీ చేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితికి మధ్యప్రదేశ్‌లో తాజాగా జరిగిన సంఘటన అద్దం పడుతోంది. కొంతమంది ఆక్సిజన్ సిలెండర్ల తీవ్రతను గ్రహించి లూటీ చేశారు. ఎంపీలోని దామోహ్ జిల్లా ఆసుపత్రిలో కొందరు వ్యక్తులు ఆక్సిజన్ సిలెండర్లను లూటీ చేశారు. ప్రస్తుతం ఈ కోవిడ్ ఆసుపత్రిలోని దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
దామో జిల్లా ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు ఆక్సిజన్ సిలిండర్లను ఎత్తుకెళ్లారు. సోమవారం కూడా ఇలాంటి సంఘటనే జరగడంతో వెంటనే దామో జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారు. వారిని ఆసుపత్రి వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఆపారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. అయితే ఈ సంఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని జిల్లా కలెక్టర్ తరుణ్ రతి పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ విధులను నిర్వర్తించడం చాలా కష్టమవుతోందని దామో జిల్లా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అడ్డుకున్న అనంతరం సిలిండర్లను ఎత్తుకెళ్లే వారంతా ఆగిపోయారని తెలిపారు.
ఇదిలాఉంటే.. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తమ వద్ద ఆక్సిజన్ మిగులు సరఫరా ఉందని పేర్కొంది. ప్రస్తుతం 390 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను పొందామని.. కరోనా బాధితులందరికీ వైద్యం అందుతుందని ప్రకటించింది. కాగా అదేరోజు సిలిండర్ల లూటీ జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Also Read: