AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panneerselvam: బీజేపీతో బంధం తెంచుకున్న పన్నీర్‌ సెల్వం..! కారణం ఏంటంటే..?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే క్యాడర్ హక్కుల పునరుద్ధరణ కమిటీ, బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) నుండి వైదొలిగింది. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రజా సంబంధాలను బలోపేతం చేయడానికి పన్నీర్‌సెల్వం రాష్ట్రవ్యాప్త పర్యటన చేయనున్నారు.

Panneerselvam: బీజేపీతో బంధం తెంచుకున్న పన్నీర్‌ సెల్వం..! కారణం ఏంటంటే..?
Panneerselvam Bjp
SN Pasha
|

Updated on: Jul 31, 2025 | 3:44 PM

Share

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే క్యాడర్ హక్కుల పునరుద్ధరణ కమిటీ గురువారం బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. పన్నీర్‌సెల్వం, ఇతర ప్యానెల్ సభ్యులతో కలిసి జరిగిన విలేకరుల సమావేశంలో ప్రముఖ నేత, కమిటీ సలహాదారు పన్రుతి ఎస్ రామచంద్రన్ ఈ ప్రకటన చేశారు. “ఇకపై కమిటీ ఎన్డీఏలో భాగం కాదు” అని రామచంద్రన్ విలేకరులతో అన్నారు. ప్రజలతో మమేకం కావడానికి, కమిటీ స్థావరాన్ని బలోపేతం చేయడానికి పన్నీర్‌సెల్వం త్వరలో తమిళనాడులోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తారని ఆయన అన్నారు. రాజకీయ పరిస్థితిని బట్టి, భవిష్యత్తులో రాజకీయ పొత్తులపై తాము నిర్ణయం తీసుకుంటుందని రామచంద్రన్ అన్నారు.

గురువారం పన్నీర్ సెల్వం నాయకత్వంలో AIADMK వాలంటీర్ల హక్కుల పునరుద్ధరణ కమిటీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజకీయ పరిస్థితి, భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని తాము నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌తో సంబంధాలను తెంచుకుంటున్నాం. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుండి వైదొలగడానికి గల కారణం దేశం మొత్తానికి తెలుస్తుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటే.. పన్నీర్ సెల్వం తమిళనాడు అంతటా పర్యటించి ప్రజలను, స్వచ్ఛంద సేవకులను కలుస్తారు. ప్రస్తుతం మేం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదు. ఇకపై ఎప్పటికీ బిజెపి కూటమిలో భాగం కాము. భవిష్యత్తులో పరిస్థితిని బట్టి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయిస్తాం రామచంద్రన్‌ స్పష్టం చేశారు.

ఇటీవలే అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, ఓపీఎస్ బృందంతో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌తో పొత్తు పెట్టుకుంది. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని కూడా చెబుతున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే ఎవరిదిఅనే దానిపై ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య విభేదాలు ఉన్నాయి. అందులో ప్రస్తుత అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామికి మద్దతుగా ఆదేశాలు జారీ చేసిన తర్వాత అన్నాడీఎంకేను మళ్ళీ కైవసం చేసుకునే లక్ష్యంతో ఓపీఎస్ బృందం ఎడప్పాడి పళనిస్వామికి వ్యతిరేకంగా మద్దతుదారులు, స్వచ్ఛంద సేవకులను సేకరిస్తోంది. దీని కారణంగానే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌లో చేరిన అన్నాడీఎంకేతో కలిసి పనిచేయలేక ఓపీఎస్ బృందం అధికారికంగా పార్టీని విడిచిపెట్టింది.

స్టాలిన్‌తో మార్నింగ్‌ వాక్‌ తర్వాత..

ఎన్డీయే నుంచి బయటికి వస్తున్నట్లు రామచంద్రన్‌ ప్రకటించే సమయంలో సెల్వం కూడా అక్కడే ఉన్నారు. కాగా, మార్నింగ్‌ వాక్‌ సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను పన్నీర్‌ సెల్వం కలిశారు. పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. సీఎంతో చర్చల తర్వాత ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి
ఏంటీ ఎప్పుడూ జుట్టు అతిగా రాలిపోతుందా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే!
ఏంటీ ఎప్పుడూ జుట్టు అతిగా రాలిపోతుందా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే!