Opposition Unity: అందరి లక్ష్యం ఒకటే.. విపక్షాల ఐక్యతకు వేదికగా కర్ణాటక.. నెక్స్ట్ టార్గెట్ అదేనా..?

కర్నాటకలో సిద్దరామయ్య ప్రమాణస్వీకారోత్సవం విపక్షాల ఐక్యతకు వేదికగా నిలిచింది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న చాలా పార్టీల నేతలు ఒకే వేదికపై కన్పించారు. అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో జేపీసీ కోసం పోరాటం తరువాత విపక్ష నేతలు మరోసారి ఐకమత్యాన్ని చాటారు.

Opposition Unity: అందరి లక్ష్యం ఒకటే.. విపక్షాల ఐక్యతకు వేదికగా కర్ణాటక.. నెక్స్ట్ టార్గెట్ అదేనా..?
Opposition Leaders
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 20, 2023 | 6:14 PM

కర్నాటకలో సిద్దరామయ్య ప్రమాణస్వీకారోత్సవం విపక్షాల ఐక్యతకు వేదికగా నిలిచింది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న చాలా పార్టీల నేతలు ఒకే వేదికపై కన్పించారు. అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో జేపీసీ కోసం పోరాటం తరువాత విపక్ష నేతలు మరోసారి ఐకమత్యాన్ని చాటారు. 2024 పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు ఇది కీలక పరిణామమమని చెప్పుకోవచ్చు. బెంగాల్‌ సీఎం మమత ఈ కార్యక్రమానికి హాజరు కానప్పటికీ టీఎంసీ తరపున ప్రతినిధిని పంపించారు. కాంగ్రెస్‌ బలంగా ఉన్న చోట్ల తప్పకుండా ఆ పార్టీకి మద్దతిస్తామని మమత బెనర్జీ స్పష్టంచేశారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడానికి తాజాగా ప్రయత్నాలు మొదలుపెట్టారు బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌. సిద్దరామయ్య ప్రమాణస్వీకారోత్సవానికి నితీష్‌తో పాటు తేజస్వియాదవ్‌ కూడా హాజరయ్యారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ కూడా సిద్దూ ప్రమాణస్వీకారోత్సవానికి విచ్చేశారు. బీజేపీని ఓడించడమే లక్ష్యమని ఇప్పటికే ప్రకటించారు నితీష్‌ , స్టాలిన్‌ . కశ్మీర్‌ నేతలు ఫరూఖ్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కూడా విచ్చేశారు.

మహారాష్ట్రలో ఏంవీఏ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న శరద్‌పవార్‌ కూడా కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకు సిద్దూ ప్రమాణస్వీకారంలో పాల్గొన్నారు. సినీ నటుడు, మక్కల్‌ నీది మయం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ తదితరులు హాజరయ్యారు. అయితే, సిద్దరామయ్య ప్రమాణస్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఆహ్వానం లేదు. కేసీఆర్‌, కేజ్రీవాల్‌ ఇద్దరు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు గళమెత్తుతున్నారు. రాష్ట్రాలను బట్టి కాంగ్రెస్‌ పొత్తులపై నిర్ణయం తీసుకుంటోంది.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో పార్టీ బలంగా ఉండడంతో బీఆర్‌ఎస్‌ పొత్తు అవసరం లేదని ఇప్పటికే రాహుల్‌తో సహా కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు. పంజాబ్‌ , ఢిల్లీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆప్‌తో దూరం పాటిస్తోంది కాంగ్రెస్‌. ఈ నేపథ్యంలో మున్ముందు ఎలాంటి రాజకీయ పరిణామాలు ఏర్పడతాయన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీతో ఢీకొట్టేందుకు అన్ని పార్టీలు ఒకేతాటిపైకి రావాలంటున్న కీలక నేతలు.. ప్రతిపక్ష ఐక్యతతోపాటు.. 2024 ఎన్నికల్లో ఎలా పోరాడుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే ఐక్యత మున్ముందు ఉంటుందా..? లేదా అన్నది.. ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్..

త్వరలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌, తెలంగాణ లాంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో విపక్షాల ఐక్యత 2024 ఎన్నికలకు ముందు బలంగా వినిపిస్తుందని పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..