వ్యాక్సినేషన్ కి ఇక ‘కోవిన్’ పై ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు….కేంద్రం స్పష్టీకరణ

కోవిద్ వ్యాక్సినేషన్ కి ఇక కోవిన్ పై ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ ...ఏ వ్యక్తి అయినా దగ్గరలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి అక్కడే ఆన్-సైట్ రిజిస్ట్రేషన్ చేయించుకుని

వ్యాక్సినేషన్ కి ఇక కోవిన్ పై ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు....కేంద్రం స్పష్టీకరణ
Zydus Cadila Zycov D Covid 19 Vaccine

Edited By: Anil kumar poka

Updated on: Jun 15, 2021 | 9:29 PM

కోవిద్ వ్యాక్సినేషన్ కి ఇక కోవిన్ పై ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ …ఏ వ్యక్తి అయినా దగ్గరలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి అక్కడే ఆన్-సైట్ రిజిస్ట్రేషన్ చేయించుకుని అప్పుడే టీకామందు తీసుకోవచ్చునని పేర్కొంది. కోవిన్ ప్లాట్ ఫామ్ అన్నది కేవలం రిజిస్ట్రేషన్లలోని పలు మోడ్ లలో ఒకటి మాత్రమేనని వివరించింది. హెల్త్ కేర్ వర్కర్లు లేదా ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో గానీ–అర్బన్ స్లమ్స్ లో గానీ ప్రజలను ఆన్-లైన్ రిజిస్ట్రేషన్ల వైపు మొగ్గేలా చూడవచ్చునని..ఇలా వ్యాక్సినేషన్ కవరేజీని పెంచవచ్చునని ఈ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 13 వరకు కోవిన్ పై రిజిస్ట్రేషన్ల ద్వారా 23.36 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా..వీరిలో 16.45 కోట్ల మంది ఆన్-సైట్ మోడ్ ని ఎంచుకున్నారు.

ఈ ఏడాది జనవరి 16 నుంచి దేశ వ్యాప్తంగా ఇండియా అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ప్రారంభించింది. ఇప్పటివరకు 25.9 కోట్ల వ్యాక్సిన్ ని ప్రజలకు ఇచ్చారు. కాగా- కోవిద్ కేసులు తగ్గుతున్న కారణంగా కోవిన్ పై ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదన్న నిర్ణయాన్ని తీసుకున్నట్టు కనిపిస్తోంది. పైగా జూన్ 21 నుంచి దేశ వ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా కేంద్రం చేపడుతోంది. అటు-ఢిల్లీలో కేసులు చాలావరకు తగ్గిపోయాయి. దీంతో నిన్నటి నుంచే అన్ని మార్కెట్లను, మాల్స్ ను అనుమతిస్తున్నారు. అయితే సినీ థియేటర్లు తదితరాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి: రైళ్లో సీటు కోసం ఏకంగా యువకుడు చేసిన తతంగం నవ్వులు పూయిస్తున్న వీడియో : Viral Video.

Rare Photos and videos: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్ వీడియో.

 Dog Viral Video : చెట్టు కొట్టకుండా అడ్డుపడిన కుక్క..ఎందుకంటే!వైరల్ అవుతున్న వీడియో.

యంగ్ హీరో నిఖిల్ ఖాతాలో మరో మూడు సినిమాలు.?బిజీ బిజీ గా యంగ్ హీరో :Nikhil Siddharth Video.