AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

One Nation One Election: మరోసారి తెరపైకి జమిలి ఎన్నికలు.. రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేసిన లా కమిషన్

దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ రెండో సమావేశం బుధవారం అక్టోబర్ 25న ఢిల్లీలో జరిగింది. ఏకకాలంలో ఎన్నికలు ఎలా నిర్వహించాలనే దానిపై అభిప్రాయాలను సేకరించేందుకు ఈ సమావేశానికి లా కమిషన్‌ను కమిటీ ఆహ్వానించింది. దీనికి సంబంధించి లా కమిషన్ రోడ్‌మ్యాప్‌ను కమిటీ సభ్యులు వివరించారు అధికారులు.

One Nation One Election: మరోసారి తెరపైకి జమిలి ఎన్నికలు.. రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేసిన లా కమిషన్
Ramnath Kovind Committee
Balaraju Goud
|

Updated on: Oct 25, 2023 | 11:06 AM

Share

దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ రెండో సమావేశం బుధవారం అక్టోబర్ 25న ఢిల్లీలో జరిగింది. ఏకకాలంలో ఎన్నికలు ఎలా నిర్వహించాలనే దానిపై అభిప్రాయాలను సేకరించేందుకు ఈ సమావేశానికి లా కమిషన్‌ను కమిటీ ఆహ్వానించింది. దీనికి సంబంధించి లా కమిషన్ రోడ్‌మ్యాప్‌ను కమిటీ సభ్యులు వివరించారు అధికారులు.

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌పై కమిటీ చర్చించింది. 8 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై మాజీ రాష్ట్రపతి కమిటీ సభ్యులతో చర్చించారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలను, రాష్ట్రాల సవాళ్లను కమిటీ తెలుసుకుంది.

వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించి ఏర్పాటైన కమిటీ బుధవారం సమావేశం జరిగింది. గత సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి ఈ వ్యవస్థపై అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించారు. వచ్చే మూడు నెలల్లో తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలియజేయడానికి కమిటీ పార్టీలకు అవకాశం ఇచ్చింది. అదే సమయంలో, లా కమిషన్ చైర్మన్ రితురాజ్ అవస్తీ మాట్లాడుతూ, దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి, ప్రభుత్వం రాజ్యాంగంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయాల్సి ఉంటుందని కమిటీ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ మేరకు కొన్ని కీలక సూచనలు చేసినట్లు తెలుస్తుంది. రుతురాజ్ అవస్తి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 22వ లా కమిషన్ ఛైర్మన్ కూడా. దేశంలో జరగబోయే ఎన్నికలను ఏ విధంగా క్రమబద్ధీకరించవచ్చో ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం లా కమిషన్‌కు అప్పగించింది.

గత కొన్ని రోజులుగా ఒకే దేశం.. ఒకే ఎన్నికలకు సంబంధించి తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో చెప్పడం మాత్రం కష్టం. ఇంకా టైమ్‌లైన్ ఇవ్వలేమని, ఖచ్చితమైన టైమ్‌లైన్ నిర్ణయించడం సాధ్యం కాదని లా కమిషన్ చైర్మన్ అన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహించడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. విపక్షాలు మాత్రం ఒకే దేశం ఒకే ఎన్నికల విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే జమిలి ఎన్నికల కోసం కావల్సిన అవకాశాలు నిరంతరం అన్వేషిస్తున ఉంది కమిటీ.

డిసెంబర్ 2022లో దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనపై జాతీయ రాజకీయ పార్టీలు, భారత ఎన్నికల సంఘం, అధికారులు, విద్యావేత్తలు, నిపుణులతో సహా అన్ని వర్గాల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి 22వ లా కమిషన్ ఆరు ప్రశ్నల సెట్‌ను సిద్ధం చేసింది. కమిషన్ నివేదికను 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రచురించి, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సమర్పించాలని భావిస్తున్నారు .

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…