SYL Canal: పంజాబ్ ముఖ్యమంత్రిపై సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ
పంజాబ్‌లో 80 శాతం నీరు డార్క్ జోన్‌లో ఉందని, రాష్ట్రంలో తక్కువ నీరు ఉందని, అయితే తమ వద్ద ఉన్న నీటిని ఆదా చేసేందుకు ప్రభుత్వం ఏమీ చేయడం లేదని సిద్ధూ మండిపడ్డారు. తాగునీరు దొరకని విధంగా నీటి సమస్య పెరిగిందన్న ఆయన.. పంజాబ్‌లో నీటి కొరత తీర్చడంలో ఆప్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. గత పదేళ్లలో వర్షపాతం 30 శాతం తగ్గిందన్న సిద్ధూ.. ముఖ్యమంత్రికి జనం బాధలు పట్టడం లేదని విరుచుకుపడ్డారు.

పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన అనేక సమస్యలపై ఆప్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ప్రజల దృష్టిని వాస్తవ సమస్యల నుంచి మళ్లించేందుకే ప్రభుత్వం సట్లెజ్ యమునా లింక్ కాలువ సమస్యకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. జలంధర్‌లో ఏర్పాటు చేసిన మీడియ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ స్వలాభం కోసం వ్యవస్థను మార్చుకోవడం దారుణమన్నారు. ఆ వ్యవస్థ రాష్ట్రాన్ని వెనుకకు నెట్టివేసిందన్న ఆయన, అందుకే నేటికీ వాస్తవ సమస్యల నుండి దృష్టి మరల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
పంజాబ్‌లో 80 శాతం నీరు డార్క్ జోన్‌లో ఉందని, రాష్ట్రంలో తక్కువ నీరు ఉందని, అయితే తమ వద్ద ఉన్న నీటిని ఆదా చేసేందుకు ప్రభుత్వం ఏమీ చేయడం లేదని సిద్ధూ మండిపడ్డారు. తాగునీరు దొరకని విధంగా నీటి సమస్య పెరిగిందన్న ఆయన.. పంజాబ్‌లో నీటి కొరత తీర్చడంలో ఆప్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. గత పదేళ్లలో వర్షపాతం 30 శాతం తగ్గిందన్న సిద్ధూ.. ముఖ్యమంత్రికి జనం బాధలు పట్టడం లేదని విరుచుకుపడ్డారు.
పంజాబ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తాగునీరు కూడా లేదని, ఉన్న నీటిని ఎలా నిర్వహించాలనేదే అసలు సమస్య అని కాంగ్రెస్ నేత సిద్ధూ అన్నారు. ప్రజలకు తాగేందుకు అందుబాటులో ఉండాల్సిన కాలువ నీటిని కలుషితం చేశారని ఆరోపించారు. పంజాబ్‌లోని బియాస్, సట్లెజ్ నది సంగమం హరికే బ్యారేజీ వద్ద A గ్రేడ్ కాలువ నీరు త్రాగడానికి సరిపోతుంది. ఇప్పుడు అది C గ్రేడ్‌కు మారింది. ఇప్పుడు రోపర్ కాలువ నీరు మాత్రమే తాగడానికి ఉపయోగపడుతుందన్నారు.
పంజాబ్ ప్రభుత్వం విద్యుత్ యూనిట్ రూ.17 నుంచి రూ.20కి కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. పీఎస్‌పీసీఎల్‌కు తనఖా పెట్టి ప్రజలకు విద్యుత్ అందిస్తున్నారని సిద్ధూ మండిపడ్డారు. రైతులు పండించిన పంటలకు సరైన మార్కెట్ ధర దొరకడం లేదన్నారు. మద్యం ద్వారా ఆదాయం సమకూరుతుందన్న చర్చ జరిగినా అక్రమ మద్యం విక్రయాలు పెరిగిపోయాయని ఆరోపించారు. పంజాబ్ సమస్యలపై మాట్లాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్న ఆయన.. పంజాబ్‌లో రాజకీయ నాయకులు, పోలీసులు, స్మగ్లర్ల మధ్య అనుబంధం ఉందని ఆరోపించారు. అక్రమ దందాలను సర్కార్ వెంటనే ఛేదించాలని సిద్ధూ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో విద్యా విధానం ఎక్కడ ఉందని పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సిద్ధూ ప్రశ్నించారు. యువత పంజాబ్‌లోని గ్రామాల్లో నివసించకుండా పచ్చని పచ్చిక బయళ్ల కోసం దేశం విడిచి వెళ్ళే ఆందోళనకర పరిస్థితి నెలకొందన్నారు. భారతదేశాన్ని విడిచిపెట్టకుండా నిరోధించడానికి బలమైన విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల కొరత లేదని, మౌలిక సదుపాయాలు పటిష్టంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే వారు విదేశాలకు వెళ్లకుండా నిరోధించడానికి, ప్రభుత్వం వారికి గౌరవప్రదమైన ఆదాయాన్ని ఇవ్వాలని కోరారు సిద్ధూ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..