Rama Mandir: సరికొత్త చరిత్ర సృష్టించిన అయోధ్య.. కన్నుల పండువగా సాగిన యాత్ర

దీపావళి వేడుకల్లో అయోధ్య చరిత్ర సృష్టించింది. సరయూ నదీతీరాన 51 ఘాట్‌లలో ఏకంగా 24 లక్షల దీపాలు వెలిగాయి. శ్రీరామజన్మభూమి పథ్‌లో గత ఏడాది 15.76 లక్షల దీపాలు ఇక్కడ వెలిగిస్తే, ఈసారి 24 లక్షల దీపాలను వెలిగించారు. అయోధ్య దీపోత్సవానికి 41 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి స్వయంగా హారతి ఇచ్చారు. కేంద్రంలో మోదీ పాలనను రామరాజ్యంతో పోల్చారు యోగి ఆదిత్యనాథ్‌.

Rama Mandir: సరికొత్త చరిత్ర సృష్టించిన అయోధ్య.. కన్నుల పండువగా సాగిన యాత్ర
On The Occasion Of Diwali, Up Cm Yogi Adityanath Lit 24 Lakh Lamps In Ayodhya Ram Mandir.

Updated on: Nov 11, 2023 | 10:13 PM

దీపావళి వేడుకల్లో అయోధ్య చరిత్ర సృష్టించింది. సరయూ నదీతీరాన 51 ఘాట్‌లలో ఏకంగా 24 లక్షల దీపాలు వెలిగాయి. శ్రీరామజన్మభూమి పథ్‌లో గత ఏడాది 15.76 లక్షల దీపాలు ఇక్కడ వెలిగిస్తే, ఈసారి 24 లక్షల దీపాలను వెలిగించారు. అయోధ్య దీపోత్సవానికి 41 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి స్వయంగా హారతి ఇచ్చారు. కేంద్రంలో మోదీ పాలనను రామరాజ్యంతో పోల్చారు యోగి ఆదిత్యనాథ్‌.

తొమ్మిదేళ్ల కిందట రామరాజ్య స్థాపన జరిగిందనీ, అయితే రామ మందిర నిర్మాణం ఈ పునాదులను పటిష్టం చేసిందని యోగి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దీపోత్సవ్‌ కార్యక్రమాన్ని చేపట్టామనీ, ఇక్కడ రామాలయ నిర్మాణమే అందరి అభిలాషగా మారిందని యోగి వివరించారు. అయోధ్యలో దీపావళి దీపోత్సవానికి ఈసారి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈసారి అయోధ్య నిర్మాణం పూర్తికావచ్చింది. గ్రౌండ్‌ఫ్లోర్‌ పూర్తయి, ఫస్ట్‌ ఫ్లోర్‌ నిర్మాణం సాగుతోంది. ఈసారి అయోధ్య రామాలయంలోని గర్భగుడిలో ఉన్న రాములవారిని భక్తులు దర్శించుకోవడం ప్రత్యేకతను సంతరించుకుంది.

అయోధ్యలో దీపోత్సవానికి ముందు సీతారాముల పట్టాభిషేక దృశ్యాన్ని ఆవిష్కరించారు. సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయ పాత్రధారులు కూర్చున్న రథాన్ని స్వయంగా యూపీ సీఎం యోగి, గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ లాగారు. రామకథా పార్క్‌ నుంచి ఈ రథయాత్ర మొదలైంది. తర్వాత ఆ పాత్రధారులను వేదిక మీదకు తీసుకొచ్చి తిలకధారణ చేశారు. ఈ కార్యక్రమాన్ని చూడటానికి జనం పోటెత్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..