Jaipur: షాకింగ్‌ న్యూస్.! టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో నల్లధనం వెలికితీత.

Jaipur: షాకింగ్‌ న్యూస్.! టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో నల్లధనం వెలికితీత.

Anil kumar poka

|

Updated on: Nov 11, 2023 | 7:26 PM

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఒక సంస్థకు చెందిన ప్రైవేట్‌ లాకర్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఒక లాకర్‌లో లక్షల్లో డబ్బును కనుగొన్నారు. మరో లాకర్‌లోని సంచిలో భారీగా ఉన్న నోట్ల కట్టలను లెక్కపెట్టడానికి ఆపసోపాలు పడ్డారు. టీచర్ రిక్రూట్‌మెంట్ పేపర్ లీక్‌ ద్వారా సంపాదించిన నల్ల ధనాన్ని జైపూర్‌లోని గణపతి ప్లాజాలోని ప్రైవేట్‌ లాకర్లలో ఉంచారని బీజేపీ ఎంపీ కిరోరి లాల్ మీనా గత నెలలో ఆరోపించారు.

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఒక సంస్థకు చెందిన ప్రైవేట్‌ లాకర్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఒక లాకర్‌లో లక్షల్లో డబ్బును కనుగొన్నారు. మరో లాకర్‌లోని సంచిలో భారీగా ఉన్న నోట్ల కట్టలను లెక్కపెట్టడానికి ఆపసోపాలు పడ్డారు. టీచర్ రిక్రూట్‌మెంట్ పేపర్ లీక్‌ ద్వారా సంపాదించిన నల్ల ధనాన్ని జైపూర్‌లోని గణపతి ప్లాజాలోని ప్రైవేట్‌ లాకర్లలో ఉంచారని బీజేపీ ఎంపీ కిరోరి లాల్ మీనా గత నెలలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో గణపతి ప్లాజాలో ఉన్న సుమారు 1,100 లాకర్లను ఐటీ అధికారులు తెరిచి చూశారు. అక్టోబర్ 17న మూడు లాకర్ల నుంచి సుమారు రూ.30 లక్షలు, అక్టోబర్ 21న మరికొన్ని లాకర్ల నుంచి రూ.2.46 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం గణపతి ప్లాజాలోని మరికొన్ని లాకర్లను ఐటీ అధికారులు తెరిచారు. ఒక లాకర్‌ నుంచి 7.5 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. మరో లాకర్‌లో కరెన్సీ నోట్లతో కూడిన సంచిని కనుగొన్నారు. అందులో ఉన్న నోట్ల కట్టలను లెక్కించారు. ఇప్పటి వరకు గణపతి ప్లాజాలోని లాకర్ల నుంచి ఏడు కోట్లకు పైగా డబ్బు, 12 కిలోలకు పైగా బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది డిసెంబర్‌లో గ్రేడ్ 2 టీచర్ రిక్రూట్‌మెంట్ పేపర్ లీక్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేశారు. పేపర్ లీక్‌ కేసుకు సంబంధించి 37 మంది అభ్యర్థులు సహా 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.60 లక్షలకు పేపర్‌ను లీక్‌ చేసినట్లు దర్యాప్తులో పేర్కొన్న రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు బాబులాల్ కటారాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.