Karnataka Elections: ఎమ్మెల్యేగా ఎంపికైన అత్యంత వయోవృద్ధుడు.. ఐనా ఫలించని బీజేపీ ఎత్తుగడలు

|

May 14, 2023 | 11:12 AM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అత్యంత వయోవృద్ధుడైన శామనూరు శివశంకరప్ప ఎమ్మెల్యేగా మరోసారి జయకేతనం ఎగురవేశారు. 92 ఏళ్ల శివశంకరప్ప వరుసగా నాలుగోసారి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేత అయిన శివశంకరప్ప దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా..

Karnataka Elections: ఎమ్మెల్యేగా ఎంపికైన అత్యంత వయోవృద్ధుడు.. ఐనా ఫలించని బీజేపీ ఎత్తుగడలు
MLA Shiva Shankarappa
Follow us on

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అత్యంత వయోవృద్ధుడైన శామనూరు శివశంకరప్ప ఎమ్మెల్యేగా మరోసారి జయకేతనం ఎగురవేశారు. 92 ఏళ్ల శివశంకరప్ప వరుసగా నాలుగోసారి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేత అయిన శివశంకరప్ప దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేసిన అత్యంత వయోవృద్ధుడిగా రికార్డు సృష్టించారు. నిజానికి ఈ సారి ఎన్నికల్లో శంకరప్పకు పోటీగా బీజీపీ అభ్యర్ధి బీజీ అజయ్‌కుమార్‌ను పోటీగా నిలబెట్టారు కమలనాథులు. ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ముస్లింలు ఉన్నారు. వారితో అజయ్‌కుమార్‌కు మంచి సత్సంబంధాలు ఉండటంతో బీజేపీకి విజయం ఖాయమనుకున్నారంతా. కానీ ఈసారి కూడా శివశంకరప్పకే ప్రజలు పట్టం కట్టారు. దీంతో బీజేపీ వ్యూహం బెడిసికొట్టినట్లైంది.

శివశంకరప్ప రాజకీయ ప్రస్తానం ఇదీ..

హస్తం పార్టీ అభ్యర్ధిగా1994లో శివశంకరప్ప రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. అదే ఏడాది దావణగెరె నియోజకవర్గం నుంచి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. 2004లో మరోసారి దావణగెరె నుంచే పోటీ చేసి గెలుపొందారు. దావణగెరె నియోజకవర్గ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న శివశంకరప్ప 2008, 2013, 2018, 2023లో వరసగా గెలుపొందారు. ఇలా దాదాపు ఒక్క దావణగెరె నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.