Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదంలో కీలక మలుపు… పరారీలో బాలాసోర్ సిగ్నల్ జేఈ..

జూన్ 18న పశ్చిమ బెంగాల్‌కు చెందిన 24 ఏళ్ల ప్రయాణికుడు కటక్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇతడి మరణంతో మృతుల సంఖ్య 292కి చేరింది. జూన్ 6న బాలాసోర్ రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. విచారణ సందర్బంగా.. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో

Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదంలో కీలక మలుపు... పరారీలో బాలాసోర్ సిగ్నల్ జేఈ..
Odisha Train Accident

Edited By:

Updated on: Jun 20, 2023 | 6:49 PM

ఒడిశాలోని బాలాసోర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా బాలాసోర్ సిగ్నల్ జేఈ అమీర్ ఖాన్ ఇంటికి సీబీఐ సీల్ వేసింది. ఎలక్ట్రానిక్ ఇంటర్‌ లాకింగ్ సిస్టమ్‌లో ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోవడం వల్లే ఒడిశా రైలు దుర్ఘటన జరిగిందని రైల్వే అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు.. ఆ కోణంలో సీబీఐ విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా కొన్ని రోజుల క్రితం సిగ్నల్ జేఈని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అయితే, అతన్ని మళ్లీ ప్రశ్నించేందుకు అతడు ఉంటున్న ఇంటికి వెళ్లగా.. సిగ్నల్ జేఈ అమీర్‌ ఖాన్‌ తన కుటుంబం సహా పారిపోయినట్టుగా గుర్తించారు. దీంతో అతని ఇంటికి సీబీఐ సీల్ వేసింది. ఇద్దరు అధికారులను నియమించి జేఈ అమీర్ ఖాన్ ఇంటిపై నిఘా ఏర్పాటు చేసింది.

అంతకుముందు సీబీఐ.. సిగ్నల్ జేఈ అమీర్‌ ఖాన్‌ను గుర్తు తెలియని ప్రదేశంలో విచారించినట్టుగా సమాచారం. జూన్ 16న ఆయన ఇంటికి వెళ్లిన సీబీఐ బృందం సోమవారం మరోమారు ఆయన ఇంటికి వెళ్లింది. కానీ, ఇంజనీర్ నివాసానికి తాళం వేసి ఉండడాన్ని గుర్తించి సీల్ చేసింది.

జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇప్పటివరకు 292 మంది మరణించారు. వందలాది మంది గాయపడి చికిత్స పొందుతున్నారు. జూన్ 18న పశ్చిమ బెంగాల్‌కు చెందిన 24 ఏళ్ల ప్రయాణికుడు కటక్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇతడి మరణంతో మృతుల సంఖ్య 292కి చేరింది. జూన్ 6న బాలాసోర్ రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదం తర్వాత ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో, సీబీఐ విచారణ ప్రారంభించింది. ప్రమాదం తర్వాత ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ విచారణ ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు మృతదేహాలను భద్రపరిచిన బహనాగ బజార్‌లోని ఉన్నత పాఠశాలను కూల్చివేసి పునర్నిర్మాణం చేపట్టారు. వాస్తవానికి జూన్ 16 నుంచి ఇక్కడ పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ  తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ స్కూల్ కి పంపాలంటేనే భయపడుతున్నారు. అధికారులు తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక దాంతో చేసేంది లేక పురాతన స్కూల్‌ బిల్డింగ్‌ కూల్చివేసి పునర్నిర్మాణం పనులను ప్రారంభించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..