Save Snakes: పాములను రక్షించాలని ఆదేశాలు జారీ చేసిన ఒడిశా ప్రభుత్వం

పాము కనిపిస్తే.. చాలు ఆమడ దూరం ఉరుకులు.. పరుగులు పెడుతూంటాం. ఒక అటువైపు వెళ్లడానికి కూడా భయపడి పోతారు. అత్యంత విషపూరిత జీవుల్లో పాము కూడా ఒకటి. ఇందులో ఇంకొన్ని విష పూరిత పాములు ఉంటాయి. అవి కాటు వేశాయంటే చాలు.. ప్రాణాలు గాల్లోకి పోవాల్సిందే. అలాంటి పాములను సురక్షితంగా రక్షించాలని ఆదేశాలు జారీ చేసింది ఒడిశా ప్రభుత్వం. మనుషులు జీవించే నివాస ప్రాంతాలకు దూరంగా విడిచి పెట్టాలని పేర్కొంది. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. కాగా ఒడిశాలో గత ఏడేళ్లలో 6,351..

Save Snakes: పాములను రక్షించాలని ఆదేశాలు జారీ చేసిన ఒడిశా ప్రభుత్వం
Snakes

Updated on: Aug 15, 2023 | 12:42 PM

పాము కనిపిస్తే.. చాలు ఆమడ దూరం ఉరుకులు.. పరుగులు పెడుతూంటాం. ఒక అటువైపు వెళ్లడానికి కూడా భయపడి పోతారు. అత్యంత విషపూరిత జీవుల్లో పాము కూడా ఒకటి. ఇందులో ఇంకొన్ని విష పూరిత పాములు ఉంటాయి. అవి కాటు వేశాయంటే చాలు.. ప్రాణాలు గాల్లోకి పోవాల్సిందే. అలాంటి పాములను సురక్షితంగా రక్షించాలని ఆదేశాలు జారీ చేసింది ఒడిశా ప్రభుత్వం. మనుషులు జీవించే నివాస ప్రాంతాలకు దూరంగా విడిచి పెట్టాలని పేర్కొంది. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. కాగా ఒడిశాలో గత ఏడేళ్లలో 6,351 పాముకాట్లు నమోదయ్యాయి.

1972 వన్యప్రాణి చట్టం ప్రకారం.. రాష్ట్రంలోని స్నేక్ హ్యాండర్లు మాత్రమే పాములను పట్టుకోవాలని, విడుదల చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. అలాగే వారు నిబంధనలకు కట్టుబడి ఉండాలని, లేకపోతే జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. సర్టిఫైడ్ స్నేక్ హ్యాండర్లు ఒడిశా అటవీ శాఖలకు పాముల పర్యావరణ విలువ, పాములను ఎలా గుర్తించాలి? అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయంలో ప్రజలకు అవకగాహన కల్పించడంలో సహాయపడతారు. పాములను రక్షించడం.. అలాగే వాటిని నివాస ప్రాంతాలకు దూరంగా విడిచిపెట్టడం.. దానికి సంబంధించి డేటాబేస్ ను ప్రభుత్వం ఎప్పటికప్పడూ చెక్ చేస్తుందని వెల్లడించింది.

కాగా భారతదేశ తూర్పు తీరంలో ఉన్న ఒడిశాలో దాదాపు 34 శాతం అడవులతో కప్పడి ఉంది. ఈ అడవుల్లో ఎక్కువగా పాములు జీవిస్తున్నాయి. అయితే అటవీ నిర్మూలన, వ్యవసాయం, అటవీ ఆధారిత పరిశ్రమల కారణంగా.. పాములు మానవ నివాస ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో చాలా మంది పాము కాట్లకు గురై మరణిస్తున్నారు. అలాగే మరికొంత మంది పాములను కొట్టి చంపేస్తున్నారు. దీని వల్ల పలు రకాల పాములు అంతరించి పోతున్నాయి. దీంతో ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కోబ్రా, మోనోక్లెడ్ కోబ్రా, స్పెక్టాకిడ్ కోబ్రా, కామన్ ఇండియన్ క్రైట్, బ్యాండెడ్ క్రైట్, రస్సెల్స్ వైపర్ పాండ్ స్నేక్, రనాట్ స్నేక్ లు ఒడిశాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..