Vaccination Certificate: వాట్సాప్‌లో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్.. ఈజీగా డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..

| Edited By: Anil kumar poka

Aug 09, 2021 | 6:38 PM

కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను ఈజీగా పొందొచ్చు. వాట్సాప్ ద్వారా ఈ డాక్యుమెంట్‌ను క్షణాల్లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం...

Vaccination Certificate: వాట్సాప్‌లో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్.. ఈజీగా డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..
Vaccination
Follow us on

కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను ఈజీగా పొందొచ్చు. వాట్సాప్ ద్వారా ఈ డాక్యుమెంట్‌ను క్షణాల్లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి రాష్ట్రానికి, దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఇక ఈ డాక్యుమెంట్‌ను కోవిన్ పోర్టల్ నుంచి పొందే సదుపాయం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆ పోర్టల్ మొరాయిస్తోంది.

ఈ నేపధ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కేంద్ర ఆరోగ్యశాఖ వాట్సాప్‌ నుంచి పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా ట్వీట్‌ చేశారు. ఒక్క డోసు టీకా తీసుకున్నా, రెండు డోసులు తీసుకున్నా.. ఆ మేరకు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను పొందొచ్చునని.. ఈజీగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మరి డౌన్‌లోడ్‌ చేసుకునే ప్రక్రియ ఏంటో ఇప్పుడు చూద్దాం…

► మొదటిగా ‘MyGov Corona Helpdesk’ వాట్సాప్‌ నెంబర్‌ 9013151515ను చేసుకోండి.

► కోవిన్ పోర్టల్ లేదా యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్ ద్వారా ఈ ప్రక్రియను మొదలుపెట్టాలి.

► ‘Covid Certificate’ అని టైప్ చేసి సెండ్ చేయండి.

► ఆ తర్వాత మీ రిజిస్టర్ద్ ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి

► వ్యాక్సిన్ కోసం ఒకరి కంటే మించి ఒక్క ఫోన్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అయితే.. వారి జాబితా మొత్తం డిస్‌ప్లే అవుతాయి. వారిలో ఎవరికి సర్టిఫికేట్ కావాలో ఎంచుకోండి.

► ఎంతమందికి సర్టిఫికేట్లు కావాలో ఆ నెంబర్‌ను ఎంటర్ చేస్తే.. క్షణాల్లో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు వచ్చేస్తాయి. మీరు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Read Also: నీళ్లు తాగుతున్న ఏనుగుపై మొసలి దాడి చేసింది.. గజరాజుకు కోపమొచ్చింది.. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా..

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

అమ్మాయి టిక్‌ టాక్‌ వీడియో చేస్తోంది..! అప్పుడే వాళ్ల అమ్మ వచ్చింది..? ఏం జరిగిందంటే..

భారత్ వెయిట్ లిఫ్టర్లకు షాక్.. ఒలింపిక్స్‌ కమిటీ సంచలన నిర్ణయం..