సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు, బిహార్ సీఎం నితీష్ కుమార్ సిఫారసు

సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు చేయాలని  బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సిఫారసు చేశారు. ఆయన తండ్రి కేకే ఖాన్ అభ్యర్థనను పురస్కరించుకుని తాము సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తున్నట్టు..

సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు, బిహార్ సీఎం నితీష్ కుమార్ సిఫారసు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 04, 2020 | 4:55 PM

సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు చేయాలని  బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సిఫారసు చేశారు. ఆయన తండ్రి కేకే ఖాన్ అభ్యర్థనను పురస్కరించుకుని తాము సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో ఎఫ్ ఐ ఆర్ నమోదైంది గనుక తామీ నిర్ణయం తీసుకున్నామన్నారు.కాగా- ఈ కేసులో ముంబై పోలీసులు సరిగా వ్యవహరించడంలేదని ఖాన్ ఆరోపించారు. తన కుమారుడికి ప్రాణహాని ఉందని తాను గత ఫిబ్రవరిలోనే బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. అయితే జూన్ 14 న సుశాంత్ మరణించాడని, అతని మృతికి కారకులైనవారెవరో దర్యాప్తు చేయవలసిందిగా కోరినా వారు పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు.

ఇలా ఉండగా ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలనడంలో ఔచిత్యం లేదని, అసలు బీహార్ రాష్ట్రానికి ఇందులో లీగల్ గా జోక్యం చేసుకునే హక్కు లేదని సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి  తరఫు లాయర్ అంటున్నారు. సీబీఐ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదని మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే కూడా గతంలోనే పేర్కొన్నారు.