రామాలయ భూమి పూజపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ

రామాలయంపై అత్యంత తక్కువగా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొంత మౌనం వీడింది. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తొలిసారిగా...

రామాలయ భూమి పూజపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ

Congress Breaks Silence on Ayodhya Event : రామాలయంపై అత్యంత తక్కువగా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొంత మౌనం వీడింది. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తొలిసారిగా స్పందించారు. అయోధ్యలో రామాలయ భూమిపూజకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఈ విషయంపై తన ట్విట్టర్ ఖాతాలో రియాక్ట్ అయ్యారు. రామాలయ భూమిపూజ జాతి ఐక్యమత్యం, సంస్కృతి, సామాజిక భావానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. నిరాడంబరం, ధైర్యం, సహనం, త్యాగం, పట్టుదలకు మారురూపమైన దీన బంధు రాముడని, ప్రతీ ఒక్కరిలోనూ రాముడున్నాడని ప్రియాంక రాసుకొచ్చారు. సీతారాముల సందేశం, దీవెనలకు ప్రతిరూపంగా జరిగే భూమి పూజ జాతి ఐక్యతా చిహ్నంగా ఉండబోతోందని ప్రియాంక తన ట్వీట్‌లో అభివర్ణించారు.

Click on your DTH Provider to Add TV9 Telugu