అమెరికాలో దారుణ హత్యకు గురైన భారత సంతతి పరిశోధకురాలు

అమెరికాలో భారత సంతతి పరిశోధకురాలు దారుణ హత్యకు గురయ్యారు. ఆగష్టు 1న జాగింగ్‌కి వెళ్లిన సర్మిస్త సేన్‌(43)ను దుండగులు హత్య చేశారు

అమెరికాలో దారుణ హత్యకు గురైన భారత సంతతి పరిశోధకురాలు

Indian originated researcher killed: అమెరికాలో భారత సంతతి పరిశోధకురాలు దారుణ హత్యకు గురయ్యారు. ఆగష్టు 1న జాగింగ్‌కి వెళ్లిన సర్మిస్త సేన్‌(43)ను దుండగులు హత్య చేశారు. ఆమె మృతదేహం లెగసీ డ్రైవ్‌, మార్చమన్‌ వే సమీపంలోని క్రీక్ ప్రాంతంలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. టెక్సాస్ రాష్ట్రంలోని ప్లానో నగరంలో నివసిస్తోన్న సర్మిస్త ఫార్మాసిస్ట్‌గా పని చేస్తున్నారు. మాలిక్యూలర్ బయాలజీ విభాగంలో క్యాన్సర్ రోగుల కోసం ఆమె పని చేశారు. ఆగష్టు 1న జాగింగ్‌కి వెళ్లిన సమయంలో ఆమెపై దాడి చేసి, హత్య చేశారు.  మరోవైపు ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బకారి అభియోనా మోన్‌క్రీప్‌(29)గా గుర్తించారు. అతడు కొల్లీన్‌ కౌంటీ జైలులో నిర్బంధించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. సర్మిస్తను హత్య చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా సర్మిస్తకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.

Read This Story Also: స్కూళ్లు తెరిచే సమయానికి ఆ పనులన్నీ పూర్తి కావాలి: జగన్‌

Click on your DTH Provider to Add TV9 Telugu