AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anant Ambani: తనయుడి వివాహ వేళ తల్లి సందేశం.. నీతా అంబానీ వీడియో

సాయంత్రం 5.30 గంటలకు ప్రీ వెడ్డింగ్ వేడులకు ప్రారంభమయ్యాయి. మూడు రోజులు పాటు అత్యంత అట్టహాసంగా వివాహ వేడుకలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక వివాహ వేడుకలు ప్రారంభానికి ముందు అనంత్‌ అంబానీ తల్లి నీతా అంబానీ ఓ వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు...

Anant Ambani: తనయుడి వివాహ వేళ తల్లి సందేశం.. నీతా అంబానీ వీడియో
Nita Ambani
Narender Vaitla
| Edited By: |

Updated on: Mar 02, 2024 | 9:42 AM

Share

రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ వివాహ వేడుకకు సర్వం సిద్ధమమయ్యాయి. ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సీఈఓ వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధికను అనంత్‌ అంబానీ వివాహమాడనున్న విషయం తెలిసిందే. జామ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వివాహ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి అతిథులు వస్తున్నారు.

సాయంత్రం 5.30 గంటలకు ప్రీ వెడ్డింగ్ వేడులకు ప్రారంభమయ్యాయి. మూడు రోజులు పాటు అత్యంత అట్టహాసంగా వివాహ వేడుకలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక వివాహ వేడుకలు ప్రారంభానికి ముందు అనంత్‌ అంబానీ తల్లి నీతా అంబానీ ఓ వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. తన కుమారుడు వివాహా మహాత్సవానికి సంబంధించిన ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను ఆ వీడియోలో పంచుకున్నారు.

ఈ విషయమై నీతా అంబానీ మాట్లాడుతూ.. ‘అనంత్‌-రాధికల వివాహానికి సంబంధించి నాకు రెండు ముఖ్యమైన కోరికలు ఉన్నాయి. ఇందులో మొదటిది.. మన మూలాలను గుర్తుంచుకునేలా వేడుకలు నిర్వహించాలని భావించాం. ఇక రెండోది.. ఈ వేడుక మన కళలు, సంస్కృతి, దేశ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని కోరుకున్నాం. ఆ దిశగానే వివాహ వేడుకలు నిర్వహిస్తున్నాము. జామ్‌నగర్‌ మా హృదయాలకు ఎంతో దగ్గరైన ప్రాంతం. నా కెరీర్‌ను ఇక్కడే ప్రారంభించా అని నీతా చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే అనంత్‌-రాధిక పెళ్లి వేడుకల్లో పాల్గొనడానికి ఇప్పటికే ప్రముఖులు జామ్‌నగర్‌కు చేరుకుంటున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్‌ నుంచి రామ్‌చరణ్‌, ఉపాసన ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే బాలీవుడ్‌ నుంచి షారుఖ్‌ఖాన్ త‌న భార్య పిల్ల‌ల‌తో అనంత్ అంబానీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొననున్నారు. అలాగే దీపికా పదుకొణె- రణ్ వీర్ సింగ్, అలిచా భట్-రణబీర్‌ కపూర్‌, రాణీ ముఖర్జీ, అర్జున్‌ కపూర్, దర్శకుడు అట్లీ, ప్రముఖ క్రికెటర్‌ ధోనీ – సాక్షి దంపతులు వివాహానికి హాజరుకానున్నారు. శుక్రవారం ఉదయం మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌, తన సతీమణి ప్రిసిల్లా చాన్‌తో కలిసి జామ్‌నగర్‌ చేరుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..