ఈ-సిగరెట్ల నిషేధం ! అంతా అయోమయం !

ఈ-సిగరెట్ల నిషేధం ! అంతా అయోమయం !

దేశంలో ఈ-సిగరెట్లపై నిషేధం విధిస్తున్నట్టు ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. వీటి అమ్మకాలు, స్టోరేజీ వగైరాలపై తక్షణమే బ్యాన్ అమల్లోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలోని యువకులు, పిల్లలు సైతం వీటికి అడిక్ట్ అయి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని ఆమె అన్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ-సిగరెట్ల మార్కెటింగ్ విపరీతంగా జరుగుతోంది. స్మోకర్లు స్మోకింగ్ మానివేయడానికి ప్రత్యామ్నాయంగా వీటిని ఊదేస్తున్నారు. వీటి నుంచి విడుదలయ్యే నికోటిన్ ఆవిరి సాధారణ సిగరెట్ల కన్నా తక్కువ హానికరమని వీటి తయారీ సంస్థలు చెబుతున్నాయి. […]

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Sep 19, 2019 | 2:05 PM

దేశంలో ఈ-సిగరెట్లపై నిషేధం విధిస్తున్నట్టు ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. వీటి అమ్మకాలు, స్టోరేజీ వగైరాలపై తక్షణమే బ్యాన్ అమల్లోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలోని యువకులు, పిల్లలు సైతం వీటికి అడిక్ట్ అయి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని ఆమె అన్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ-సిగరెట్ల మార్కెటింగ్ విపరీతంగా జరుగుతోంది. స్మోకర్లు స్మోకింగ్ మానివేయడానికి ప్రత్యామ్నాయంగా వీటిని ఊదేస్తున్నారు. వీటి నుంచి విడుదలయ్యే నికోటిన్ ఆవిరి సాధారణ సిగరెట్ల కన్నా తక్కువ హానికరమని వీటి తయారీ సంస్థలు చెబుతున్నాయి. వీటి బ్యాన్ వల్ల కలిగే పరిణామాలపై యుఎస్ లోని రెగ్యులేటర్లు చర్చలు జరుపుతున్న తరుణంలో మన దేశంలో వీటి వాడకంపై నిషేధం విధించారు. అయితే గత కొన్ని వారాల్లో రెండు డెత్ కేసులను, శ్వాస సంబంధమైన 200 కేసులను ఈ-సిగరెట్ల వాడకంతో ముడి పెడుతూ ఆ మధ్య అమెరికాలో వార్తలు వచ్చాయి. కానీ ఇవి దానివల్లేనా అన్నది నిర్ధారణ కాలేదు. అసలు ఇండియాలో సాధారణ సిగరెట్లు, బీడీలను, నమిలే పొగాకును నిషేధించే యోచన ప్రభుత్వానికి ఉందా అన్న విషయం ఇప్పటికీ తేలలేదు. ఇండియాలో పొగాకును నమలడం వల్లో, ఇతరత్రా తీసుకోవడం వల్లో, పీల్చడం వల్లో ఏటా దాదాపు పది లక్షలమంది మృత్యువాత పడుతున్నారని అంచనా. ఈ-సిగరెట్లను కేవలం 0.02 శాతం మంది మాత్రమే వాడుతున్నారని కూడా తెలుస్తోంది.

2018 లో నిర్వహించిన సర్వే ప్రకారం.. 24.9 శాతం మంది రోజూ పొగాకు ఉత్పత్తులకు అడిక్ట్ అయ్యారట. ఈ-సిగరెట్లు వాడితే హాని తక్కువేనని బిల్ అండ్ మెలిండా ఫౌండేషన్ మాజీ అధికారి, ఆర్థికవేత్త కూడా అయిన అమీర్ ఉల్లాఖాన్ పేర్కొంటున్నారు. ఈ-సిగరెట్ల వల్ల వెలువడే ఆవిరి చాలా హానికరమైనదని మోడీ ప్రభుత్వం చెబుతోంది. నిజానికి మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ కాన్ఫరెన్స్ తీరు చూస్తే ఈ సిగరెట్ల బ్యాన్ నిర్ణయం కన్నా.. ఆ సందర్భంగా ప్రదర్శించిన వీడియో.. ఇది హెచ్చరిక బదులు వీటి యాడ్ మాదిరి ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇతర పొగాకు ఉత్పత్తులను ప్రభుత్వం ఎందుకు నిషేధించడం లేదని ట్విటర్ యూజర్లు కూడా ప్రశ్నిస్తున్నారు. గుట్కాపై బ్యాన్ ఎందుకు లేదని పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ సైతం ప్రశ్నించారు. అమెరికాలో మాదిరి కాక- ఇండియాలో పొగాకు పరిశ్రమకు ఈ-సిగరెట్ల ఇండస్ట్రీలో వాటాలు లేవు. ఈ ఏడాది ఆరంభంలో ‘ అసోచామ్ ‘ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.ఈ పరిశ్రమ ఇండియన్ ఎకానమీకి సుమారు పది లక్షల కోట్ల ఆదాయాన్ని ఇచ్చింది. అలాగే సుమారు నాలుగున్నర లక్షలమందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ-సిగరెట్లపై బ్యాన్ పుణ్యమా అని గోల్డెన్ టుబాకో, గాడ్ ఫ్రే ఫిలిప్స్, వీఎస్టీ వంటి సిగరెట్ తయారీ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. మరి..ప్రభుత్వ లక్ష్యం కూడా ఇదేనేమో తెలియడంలేదు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu