Bengaluru: ‘బ్యాచిలర్స్ అంటే ప్రతి ఒక్కరికీ లోకువైపోయింది.. బీరు బాటిళ్లు ఉంటే ఇల్లు ఖాళీ చేయిస్తారా?’

|

Apr 27, 2023 | 1:18 PM

సిటీల్లో బ్యాచిలర్స్‌కు ఇల్లు అద్దెకు దొరకడమే గగనం. అలాంటిది పోనీలే అని జాలిపడి ఇల్లు అద్దెకిస్తే.. యజమానులు పెట్టే రూల్స్‌ లిస్ట్‌ చాంతాడంత ఉంటుంది. అన్నింటికీ సర్దుకుని ఇళ్లు అద్దెకు తీసుకున్న తర్వాత బ్యాచిలర్స్‌పై యజమాని ఎప్పుడూ..

Bengaluru: బ్యాచిలర్స్ అంటే ప్రతి ఒక్కరికీ లోకువైపోయింది.. బీరు బాటిళ్లు ఉంటే ఇల్లు ఖాళీ చేయిస్తారా?
Nightmare Tenant
Follow us on

సిటీల్లో బ్యాచిలర్స్‌కు ఇల్లు అద్దెకు దొరకడమే గగనం. అలాంటిది పోనీలే అని జాలిపడి ఇల్లు అద్దెకిస్తే.. యజమానులు పెట్టే రూల్స్‌ లిస్ట్‌ చాంతాడంత ఉంటుంది. అన్నింటికీ సర్దుకుని ఇళ్లు అద్దెకు తీసుకున్న తర్వాత బ్యాచిలర్స్‌పై యజమాని ఎప్పుడూ ఓ కన్ను వేసే ఉంటాడు. ఎన్ని స్ట్రిక్ట్ రూల్స్‌ పెట్టినా వాళ్లు చేసేవి చేస్తూనే ఉంటారు. ఐతే తాజాగా ఓ ఇంటి యజమానికి ఇలాగే తన ఇంట్లో అద్దెకు ఉంటున్న బ్యాచిలర్ కుర్రాడిపై అనుమానం వచ్చింది. వెంటనే వెళ్లి ఇంటి తలుపులు తీశాడు. ఇంటి నిండా బీరు బాటిళ్లు, ఎంగిలి కంచాలు, శుచీశుభ్రంలేని ఆ ఇల్లు చూడగానే యజమానికి చిర్రెత్తుకొచ్చి వెంటనే ఇల్లు ఖాళీ చేయించాడు. ఎక్కడ జరిగిందంటే..

అత్యంత పెద్ద నగరాలలో బెంగళూరు ఒకటి. బెంగుళూరులో అపార్ట్ మెంట్ లేదా ఇల్లును అద్దెకు తీసుకోవడం అత్యంత ఖర్చుతో కూడుకున్న విషయమనే సంగతి అందరికీ తెలిసిందే. ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తోన్న వ్యక్తి డబుల్‌ బెడ్‌ రూం ఫ్లాట్‌ యజమానికి ముందుగానే 3-4 నెలల అద్దె చెల్లించాడు. ఆ తర్వాత అతను మళ్లీ అతను యజమాని కంట పడలేదు. ఓ రోజు ఇంటి యజమాని ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఇంటిని ఖాళీ చేయాలని చెప్పాడు. దాంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. ఐతే ఫ్లాట్‌ను ఖాళీ చేయడానికి సదరు వ్యక్తి సందేహిస్తున్నాడని గుర్తించిన యజమాని ఫ్లాట్‌ను సందర్శించడానికి వెళ్లాడు.

ఇవి కూడా చదవండి

ఫ్లాట్‌ తలుపులు తీసి చెత్తకుప్పలా ఉన్న ఆ రూంలను చూసి ఖంగుతిన్నాడు. కిటికీలు తెరిచే ఉంచడంతో పావురాలు లోపలికి వచ్చి మలవిసర్జన చేసిన ఆనవాళ్లు అతనికి మరింత వికారాన్ని కలిగించాయి. ఇంటి నిండా కుప్పలు తెప్పలుగా బీరు సీసాలు, నేలపై మురికితో ఉన్న పరుపు, ఎంగిలి కంచాలతో అపరిశుభ్రంగా ఉన్న వంటగది, మరుగుదొడ్లు.. ఇలా అన్నీ దారుణ స్థితిలో కనిపించాయి. చాలా కాలంగా గదిని శుభ్రంచేయలేదనే విషయం చూడగానే అర్థమైపోయింది. వెంటనే తన ఫోన్‌లో ఆ ఫ్లాట్‌ను ఫొటోలు తీసి ట్విటర్‌లో పోస్టు చేశాడు. అందుకే బ్యాచిలర్స్‌కి ఇల్లు అద్దెకివ్వకూడదు. కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ బ్యాచిలర్‌ ఈ పని చేశాడంటూ క్యాప్షన్‌తో ఈ ఫొటోలను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. బ్యాచిలర్స్ కష్టాలు మీకేం తెలుస్తాయి.. ఆ మాత్రానికే బయటికి గెంటేస్తారా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ సెక్షన్ లో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.