మహిళల ట్రాఫికింగ్ కేసులో ఎన్ఐఏ ఛార్జీషీట్

|

Oct 18, 2020 | 6:19 PM

బంగ్లాదేశ్‌కు చెందిన యువతులను అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్‌లో వ్యభిచారం చేయిస్తున్న ముఠాపై పరిశోధనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఛార్జీషీట్ దాఖలు చేసింది. మహిళల అక్రమ రవాణాను...

మహిళల ట్రాఫికింగ్ కేసులో ఎన్ఐఏ ఛార్జీషీట్
Follow us on

NIA filed charge sheet in women trafficking case: బంగ్లాదేశ్‌కు చెందిన యువతులను అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్‌లో వ్యభిచారం చేయిస్తున్న ముఠాపై పరిశోధనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఛార్జీషీట్ దాఖలు చేసింది. మహిళల అక్రమ రవాణాను ధృవీకరించడంతోపాటు… బంగ్లా యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారనం ఛార్జీషీట్‌లో పేర్కొంది ఎన్ఐఏ. హైదరాబాద్, ముంబయి నగరాల్లో వేర్వేరు దాడులలో అదుపులోకి తీసుకున్న యువతులు, వ్యభిచార గృహాల నిర్వాహకుల నుంచి మొత్తం యువతుల అక్రమ రవాణాపై కూపీ లాగింది ఎన్ఐఏ దర్యాప్తు బృందం.

బంగ్లాదేశ్‌ నుంచి దొంగతనంగా యువతులను భారత్ బోర్డర్ దాటించి సోన్ నది మీదుగా.. కోల్‌కతాకు చేర్చేవారు. అక్కడి నుంచి రైళ్ళలో హైదరాబాద్, ముంబయిలకు తరలించి, వారిని ముందుగా నిర్దేశించిన వ్యభిచార కూపాలలోకి పంపేవారు. ఈ అంశాలతో ఎన్ఐఏ దర్యాప్తు బృందం ప్రత్యేక న్యాయస్థానంలో అభియోగ పత్రాలను దాఖలు చేసింది. హైదరాబాద్ నగరంలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళల అక్రమ రవాణా కేసు తొలుత నమోదైంది. ఆ తర్వాత దీని వెనుక అంతర్జాతీయ ముఠా వుందన్న అనుమానంతో కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు.

బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు యువతులను అక్రమంగా తరలిస్తున్న ముఠాను గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో తొమ్మిది మంది బంగ్లాదేశీయులు కాగా మిగతావారిని లోకల్స్‌గా గుర్తించారు. నకిలీ ఐడీ కార్డులు సృష్టించి బంగ్లాదేశ్‌ నుంచి యువతులను అక్రమంగా తరలించి.. గృహాల్లో బందించి వ్యభిచారం చేయిస్తున్న వ్యక్తులపై తాజాగా ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ తరలించి వ్యభిచార కూపాలకు తరలిస్తున్నట్లు వివరించింది.

జల్‌పల్లి ఏరియాలో ఓ వ్యభిచార గృహంలో ఉన్న నలుగురు బంగ్లాదేశ్ యువతులను సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రస్తుతం హైదరాబాద్ షెల్టర్ హోమ్‌లో ఉంచారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ముంబయి నగరంలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన సోదాలలో అదుపులోకి తీసుకున్న వారిని ఇంకా విచారించాల్సి వుందని ఎన్ఐఏ దర్యాప్తు బృందం ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపింది.

Also read: మూసీని రక్షించకపోతే భవిష్యత్తు లేదు… పర్యావరణవేత్తల వార్నింగ్

Also read: మూసీకి ఇరువైపులా రెయిలింగ్.. వరదల నేపథ్యంలో సర్కార్ నిర్ణయం

Also read: భాగ్యనగరం పరిస్థితి చూస్తే బాధగా వుంది: విజయ్

Also read: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణి సక్సెస్

Also read: గ్రేటర్ పరిధిలో పలు రోడ్లు మూసివేత.. ఇవే ఆ రోడ్లు

Also read: దివ్యాంగ బాలికను చెరిచి, చంపేసిన కజిన్ బ్రదర్