AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సారీ నాన్న.. ఇక భరించలేను..! పెళ్లైన 2 నెలలకే నవ వధువు సూసైడ్

గార్మెంట్ కంపెనీ ఓనర్‌ అన్నాదురై కుమార్తె రిధన్య వివాహం ఏప్రిల్‌లో కవిన్‌కుమార్‌తో జరిగింది. అయితే, పెళ్లిలో 100 పౌండ్ల (800 గ్రా) బంగారు ఆభరణాలు, రూ.70 లక్షల విలువైన వోల్వో కారు కట్నం కింద ఇచ్చారు. 2.5 కోట్లు ఖర్చు చేసి వివాహం అంగరంగా వైభవంగా నిర్వహించారు. అనంతరం అత్తవారింటికి వెళ్లిన రిధన్యకు అంతలోనే వేధింపులు మొదలయ్యాయని చెప్పింది.

సారీ నాన్న.. ఇక భరించలేను..! పెళ్లైన 2 నెలలకే నవ వధువు సూసైడ్
Bride's Suicide
Jyothi Gadda
|

Updated on: Jun 30, 2025 | 12:54 PM

Share

గత కొద్ది రోజులుగా దేశంలో హత్యలు, ఆత్మహత్యల వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా అనేక కారణాల వల్ల నవ దంపతుల జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. ఏదో ఒక కారణంతో ఇద్దరిలో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకోవటం లేదంటే.. హత్యకు గురికావటం జరుగుతోంది. తాజాగా మరో నవ వధువు పెళ్లైన రెండు నెలలకే బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన తమిళనాడులోని తిరుప్పూర్‌లో చోటుచేసుకుంది. వరకట్నం కోసం భర్త, అత్తమామలు వేధించారనే ఆరోపణలతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్ని విచారిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

తమిళనాడులోని తిరుప్పూర్‌కు చెందిన గార్మెంట్ కంపెనీ ఓనర్‌ అన్నాదురై కుమార్తె రిధన్య వివాహం ఏప్రిల్‌లో కవిన్‌కుమార్‌తో జరిగింది. అయితే, పెళ్లిలో 100 పౌండ్ల (800 గ్రా) బంగారు ఆభరణాలు, రూ.70 లక్షల విలువైన వోల్వో కారు కట్నం కింద ఇచ్చారు. 2.5 కోట్లు ఖర్చు చేసి వివాహం అంగరంగా వైభవంగా నిర్వహించారు. అనంతరం అత్తవారింటికి వెళ్లిన రిధన్యకు అంతలోనే వేధింపులు మొదలయ్యాయని చెప్పింది. వివాహం జరిగిన పది రోజుల్లోనే ఆమె వరకట్నం కోసం వేధించినట్టుగా తెలిసింది. తన భర్త కవిన్ కుమార్ ఆమెను శారీరకంగా, ఆమె మామ, అత్తగారు మానసికంగా హింసిస్తున్నారని, ఆమె తన తండ్రికి తాను ఇకపై ఈ జీవితాన్ని గడపలేనని చాలాసార్లు చెప్పింది. కానీ ఆమె తల్లిదండ్రులు తమ కూతురిని అంతా బాగానే ఉంటుందని ఓదార్చారు. తిరిగి అత్తవారింటికి పంపించారు.

ఈ క్రమంలోనే ఆదివారం రిధన్య మొండిపాళయంలోని ఒక ఆలయానికి వెళ్తున్నానని చెప్పిన రిధన్య.. ఇంటి నుండి బయలుదేరింది. మార్గమధ్యలో ఆమె తన కారును ఆపి పురుగుమందుల మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. అక్కడే చాలా సేపు ఆగివున్న కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. కారు లోపల రిధన్య చనిపోయి, నోటి నుండి నురుగుతో కనిపించిందని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి

చనిపోయే ముందు రిధన్య తన తండ్రికి వాట్సాప్‌లో ఏడు ఆడియో మెసేజ్‌లను పంపింది. అందులో తాను భర్త కెవిన్ తో జీవించలేకపోతున్నానని.. వేధింపులను భరించలేకపోతున్నానని చెప్పింది. అందుకే తాను చనిపోతున్నానని.. దయచేసి తనను క్షమించాలంటూ కోరింది. అత్తవారింట్లో తను పడుతున్న బాధలు, వారు పెడుతున్న మానసిక హింసను భరించలేకపోతున్నానని, ఎవరికి చెప్పాలో తనకు తెలియటం లేదని వాపోయింది.. జీవితం ఇలాగే ఉంటుందని నేను రాజీ పడాలని వినే వారు చెబుతున్నారు. నా బాధను అర్థం చేసుకోలేకపోతున్నారు అంటూ ఆమె తన తండ్రికి మెసేజ్‌ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
200 ఏళ్లనాటి రాజమహల్‌.. 52 గదులు, 53 తలపుల వెనుక రహస్యం తెలిస్తే
200 ఏళ్లనాటి రాజమహల్‌.. 52 గదులు, 53 తలపుల వెనుక రహస్యం తెలిస్తే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
భలే టేస్ట్.. మాములుగా ఉండదు... మ్యాడైపోతారు..
భలే టేస్ట్.. మాములుగా ఉండదు... మ్యాడైపోతారు..