ఇది విన్నారా.. మోదీకి రాజకీయాలంటే అసలు నచ్చవట..!

టైటిల్ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నా.. ఇది నిజమండీ.. స్వయంగా ఆ మాటలు మన భారత ప్రధాని నరేంద్ర మోదీనే అన్నారు. అత్యంత భారీ మెజార్టీతో భారత ప్రధానిగా రెండుసార్లు పగ్గాలు చేపట్టిన మోదీ.. ఇప్పుడు రాజకీయ శక్తిగా ఎదిగారు. అంతేకాక ఆయన దేశం కోసం చేస్తున్న కృషి వర్ణనాతీతం. ఇకపోతే సోషల్ మీడియాలో మోదీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మోదీ.. తాను ఎప్పుడూ రాజకీయాల్లోకి వస్తానని ఊహించలేదని […]

ఇది విన్నారా.. మోదీకి రాజకీయాలంటే అసలు నచ్చవట..!
Follow us
Ravi Kiran

| Edited By: Srinu

Updated on: Nov 25, 2019 | 1:15 PM

టైటిల్ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నా.. ఇది నిజమండీ.. స్వయంగా ఆ మాటలు మన భారత ప్రధాని నరేంద్ర మోదీనే అన్నారు. అత్యంత భారీ మెజార్టీతో భారత ప్రధానిగా రెండుసార్లు పగ్గాలు చేపట్టిన మోదీ.. ఇప్పుడు రాజకీయ శక్తిగా ఎదిగారు. అంతేకాక ఆయన దేశం కోసం చేస్తున్న కృషి వర్ణనాతీతం.

ఇకపోతే సోషల్ మీడియాలో మోదీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మోదీ.. తాను ఎప్పుడూ రాజకీయాల్లోకి వస్తానని ఊహించలేదని చెప్పడం గమనార్హం. తన బాల్యంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూసినా.. రాజకీయాల్లోకి రావాలని తాను ఎన్నడూ అనుకోలేదని మోదీ అన్నారు.

కేవలం తనకు చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలనే ఆకాంక్ష ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయాలన్నీ మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. ఏది ఏమైనా రాజకీయాలు నచ్చవంటూనే మోదీ.. భారతదేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడం విశేషం.