AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహా ‘పవర్’ ట్విస్ట్.. బీజేపీతో శరద్ పవార్ సీక్రెట్ డీల్..?

శరద్ పవార్.. రాజకీయాల్లో ఈయన ఒక గ్రాండ్ మాస్టర్ అని చెప్పొచ్చు. 50 ఏళ్ళ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో వ్యూహాత్మక ప్రణాళికలను రచించి అపర చాణక్యుడిగా ఎదిగారు. అలాంటిది ఆయన ఇప్పుడు మోదీ-షాల వ్యూహం ముందు తలొగ్గాల్సి వచ్చిందా.? అంటే.? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కొద్దిరోజుల క్రితం శరద్ పవార్ వ్యవసాయ సంక్షోభం గురించి వివరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే పవార్ బీజేపీతో సీక్రెట్ డీల్‌ను […]

మహా 'పవర్' ట్విస్ట్.. బీజేపీతో శరద్ పవార్ సీక్రెట్ డీల్..?
Ravi Kiran
| Edited By: Nikhil|

Updated on: Nov 25, 2019 | 1:18 PM

Share

శరద్ పవార్.. రాజకీయాల్లో ఈయన ఒక గ్రాండ్ మాస్టర్ అని చెప్పొచ్చు. 50 ఏళ్ళ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో వ్యూహాత్మక ప్రణాళికలను రచించి అపర చాణక్యుడిగా ఎదిగారు. అలాంటిది ఆయన ఇప్పుడు మోదీ-షాల వ్యూహం ముందు తలొగ్గాల్సి వచ్చిందా.? అంటే.? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

కొద్దిరోజుల క్రితం శరద్ పవార్ వ్యవసాయ సంక్షోభం గురించి వివరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే పవార్ బీజేపీతో సీక్రెట్ డీల్‌ను కూడా కుదరించుకున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక దీనికి కారణమే రాత్రికి రాత్రే మారిపోయిన ‘మహా’ రాజకీయ సమీకరణాలు. గత శుక్రవారం వరకు ఎన్సీపీ, కాంగ్రెస్, సేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మంతనాలు జరపడమే కాకుండా.. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే‌ను మహారాష్ట్ర సీఎంగా కూడా ప్రకటించారు.

అయితే ఎవరూ ఊహించని రీతిలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ప్రకటించడం.. శనివారం ఉదయం దేవేంద్ర ఫడ్నవీస్ రెండోసారి మహారాష్ట్ర సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారాలు చేయడం జరిగిపోయింది. అజిత్ పవార్ పార్టీకి నమ్మకద్రోహం చేశారని.. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని ఎన్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నా.. ఇదంతా శరద్ పవర్ వెనక నుంచి నడిపిస్తున్న ‘స్క్రిప్టెడ్ డ్రామా’ అని రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీస్తోంది.

మరోవైపు సుప్రియా సూలే పెట్టిన ఓ వాట్సాప్ స్టేటస్ దీనిని మరింత రక్తి కట్టించే విధంగా చేసిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆమె స్టేటస్ ఒకసారి పరిశీలిస్తే.. ‘Who do you trust in life…never felt so cheated in my life… defended him, loved him…look what I get in return’ అంటూ అజిత్ పవార్‌ను ఉద్దేశించి పేర్కొంది.

అజిత్ పవార్, సుప్రియా సూలేకు మధ్య మొదటి నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటిది కొత్తగా ఈ ప్రేమలు ఎక్కడ నుంచి వచ్చాయని విశ్లేషకుల్లో మెదులుతున్న ప్రశ్న. ఇకపోతే మోదీతో జరిగిన భేటీలో.. ఎన్డీయే శరద్ పవార్‌కు ‘ప్రెసిడెంట్ అఫ్ ఇండియా’ పోస్ట్‌ను ఆఫర్ చేసినట్లుగా టాక్ నడుస్తోంది. అటు సుప్రియా సూలేకు కూడా మోదీ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో ఇంకా తేలాల్సి ఉండగా.. ప్రస్తుతానికి అయితే మహా రాజకీయాల్లో థ్రిల్లర్ సినిమా మాదిరిగానే రోజుకో ట్విస్ట్‌ను ప్రజలకు చూపిస్తున్నాయి. కాగా, ఇవాళ ఉదయం 10.30 గంటలకు సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడిస్తుందో అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.