Land Issue: కేవలం10 అంగులాల స్థలం కోసం కొట్టుకున్నారు.. చివరికి
కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో హత్యలు, దోపిడిలు, బెదిరింపులు సర్వసాధారణమైపోవడం కలకలం రేపుతోంది. చిన్న చిన్న కారణాల వల్లే.. హత్యలు చేసుకునే పరిస్థితులకు దారితీస్తున్నాయి. చిన్నాచితకా కారణలతోనే ఇలాంటి దారుణాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పుడు అలాంటి షాకింగ్ ఘటనే జరిగింది. కేవలం 10 అంగులాల స్థలం కోసం జరగిన గొడవలో ఒకరు హత్యకు గురయ్యారు.
కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో హత్యలు, దోపిడిలు, బెదిరింపులు సర్వసాధారణమైపోవడం కలకలం రేపుతోంది. చిన్న చిన్న కారణాల వల్లే.. హత్యలు చేసుకునే పరిస్థితులకు దారితీస్తున్నాయి. చిన్నాచితకా కారణలతోనే ఇలాంటి దారుణాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పుడు అలాంటి షాకింగ్ ఘటనే జరిగింది. కేవలం 10 అంగులాల స్థలం కోసం జరగిన గొడవలో ఒకరు హత్యకు గురయ్యారు. కర్ణాటకలోని కోలార్ అనే పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ దాడిలో మజులిల్ పాషా అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు. అయితే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కోలాకు పట్టణంలోని ఇద్రిస్‌సాబ్ నగర్‌లో మూజామిల్ పాషా నివసిస్తున్నాడు. ముజుమిల్ పాషా తండ్రి ఇంటి నిర్మాణ సమయంలో.. పక్కింటి వైపు ఉన్న స్థలంలో.. కేవలం ఓ 10 అంగుళాల కిటికీ దాని స్లాబ్ మీద నిర్మించాడు.
దీనివల్ల పక్కింట్లో నివాసం ఉంటున్నటువారికి ఈ విషయం తెలిసింది. ఇక చివరికి వాళ్లకి ముజామిల్ పాషా తండ్రి మధ్య వాగ్వాదాలు మొదల్యయాయి. కిటికీ నిర్మించడం వల్ల ఇంటి ముందు సంచరించేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. పొరుగున నివాసం ఉంటున్నటువంటి రోషన్, నబీవుల్లా, జమీర్, ఫిర్దోస్‌తో పాటు మరికొంత మంది పాషా తండ్రితో అలాగే ఆయన కుటుంబ సభ్యులతో వాదించారు. ముందుగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు జరిగాయి. ఈ తర్వాత ఈ గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి. అలాగే పరస్పరం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం దాడి చేసుకోవడం ప్రారంభించారు. ఈ సమయంలోనే నిందితులు ముజుమిల్ పాషాపైన దాడి చేశారు. దీంతో అతడికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. అతని కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అయితే అప్పటికే మజామిల్ పాషాకు తీవ్ర గాయాలు కావడంతో చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ముజామిల్ పాషా చనిపోయాడనే విషయం తెలియడంతో.. నిందితులతో పాటు వారి కుటుంబ సభ్యలు వారు ఉంటున్న ప్రాంతం నుంచి అదృష్యం అయ్యారు. అయితే ఈ ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కోలారు పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది కేవలం 10 అంగులాల భూమి కోసం ఓ వ్యక్తిని హత్య చేశారని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పుడు పారిపోయిన నిందితుల ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ మధ్యన అనేక చోట్ల భూములు, స్థలాల కోసం గొడవలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ గొడవల్లో కొన్ని ఇలా హత్యలు తీసుకునే స్థాయికి వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..