Suicides: వారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. NCRB తాజా నివేదికలో విస్తు గొలిపే విషయాలు

కరోనా ప్రభావంతో శ్రామికులు, వేతన జీవుల జీవితాల్లో ఒడిదొడుకులు మొదలయ్యాయి. వారి ఆర్థిక పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్థమైంది. ఈనేపథ్యంలోనే కుటుంబ భారం మోయలేక, మానసిక ఒత్తిడితో చాలా మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

Suicides: వారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. NCRB తాజా నివేదికలో విస్తు గొలిపే విషయాలు
Daily Wage Workers

Updated on: Aug 30, 2022 | 8:59 PM

కరోనా ప్రభావంతో శ్రామికులు, వేతన జీవుల జీవితాల్లో ఒడిదొడుకులు మొదలయ్యాయి. వారి ఆర్థిక పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్థమైంది. ఈనేపథ్యంలోనే కుటుంబ భారం మోయలేక, మానసిక ఒత్తిడితో చాలా మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే కరోనాకు ముందు కూడా వేతన జీవుల ఆత్మహత్యలు భారీగానే ఉన్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) -2021 నివేదికలో తేలింది. 2014 నుంచి శ్రామిక జీవుల బలవన్మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయని ఈ నివేదిక పేర్కొంది. దీని ప్రకారం ఆత్మహత్యకు పాల్పడుతున్న బాధితుల్లో ప్రతి నలుగురిలో ఒకరు రోజువారీ శ్రామికులు, వేతన జీవులే. ‘యాక్సిడెంటల్‌ డెత్స్‌ అండ్‌ సూసైడ్స్‌ ఇన్‌ ఇండియా’ నివేదిక ప్రకారం 2021లో మొత్తం ఆత్మహత్య బాధితుల్లో రోజువారీ వేతన సంపాదకులే ఎక్కువ. గతేడాది మొత్తం 42,004 మంది బలవన్మరణాలకు పాల్పడితే అందులో 25.6 శాతం మంది శ్రామిక జీవులే. 2020లో నమోదైన 1,53,052 ఆత్మహత్య కేసుల్లో 24.6 శాతం అంటే 37,666 మంది వేతన జీవులే. ఇక 2019లో రికార్డైన 1,39,123 ఆత్మహత్యల్లో రోజువారీ వేతన జీవుల సంఖ్య 23.4 శాతంగా ఉంది.

కరోనాతో మరింత అనిశ్చితి..

కాగా ఈ విషయంపై గురుగ్రామ్‌లోని STEPS సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్ ప్రమిత్ రస్తోగి మాట్లాడుతూ..కార్మికుల ఆత్మహత్యలను సంపూర్ణ నిస్సహాయ స్థితిగా పరిగణించాలన్నారు. ‘2020తో పోలిస్తే 2021లో దేశంలో రోజువారీ వేతన జీవుల ఆత్మహత్యల సంఖ్య 11.52 శాతం పెరిగింది, అదే సమయంలో జాతీయ స్థాయిలో ఆత్మహత్యల సంఖ్య 7.17 శాతం పెరిగింది. ఇది వారి జీవితాల్లో కొనసాగుతున్న అనిశ్చితికి ప్రతీకగా పేర్కొనవచ్చు. ఇక COVID-19 ప్రపంచానికి అతి పెద్ద ముప్పుగా పరిణమించింది. ఈ మహమ్మారి కారణంగా చాలామందికి ఉపాధి అవకాశాల్లేకుండా పోయాయి. ఈ ఆపత్కాల పరిస్థితుల్లో చాలా మందికి వారి స్వస్థలాలకు తిరిగి వెళ్ళడానికి డబ్బు కూడా లేకపోయింది. దీంతో పాటు తీవ్రమైన ఒత్తిడి, మానసిక ఆరోగ్యం క్షీణించడం తదితర కారణాలతో కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు’ అని అంటున్నారు డాక్టర్‌ ప్రమిత్‌.

ఇవి కూడా చదవండి

ఆ రాష్ట్రాల్లోనే అధిక బలవన్మరణాలు..

తాజా ఎన్‌సీఆర్‌బీ నివేదిక రాష్ట్రాల వారీగా ఆత్మహత్య కేసుల సంఖ్యను కూడా వెల్లడించింది. ఈ జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం ఆత్మహత్యల్లో మహారాష్ట్రలో 13.5 శాతం, తమిళనాడులో 11.5 శాతం, మధ్యప్రదేశ్‌లో 9.1 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 8.2 శాతం, కర్ణాటకలో 8 శాతం ఉన్నాయి. భారతదేశంలోని మొత్తం ఆత్మహత్యల్లో కర్ణాటకతో సహా ఈ మొదటి ఐదు రాష్ట్రాలు 50 శాతానికి పైగా ఉన్నాయి. మిగిలిన 23 రాష్ట్రాలు మరియు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల నుండి మిగిలిన కేసులు నమోదయ్యాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతాల విషయానికి వస్తే.. బలవన్మరణాల విషయంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉందని, రెండో స్థానంలో పుదుచ్చేరి ఉంది. 2021లో దేశంలోని 53 మెగాసిటీల్లో మొత్తం 25,891 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..