Maharashtra: నాందేడ్ ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. 48 గంటల్లో 31 మంది మృతి..
Nanded Hospital Deaths: మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. 48 గంటల్లోనే ఏకంగా 31మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 71 మంది రోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపీ ప్రభుత్వంపై మహారాష్ట్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Nanded Hospital Deaths: మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. 48 గంటల్లోనే ఏకంగా 31మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 71 మంది రోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపీ ప్రభుత్వంపై మహారాష్ట్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాలు కొనసాగుతున్నాయి. గత 48 గంటల్లోనే 31మంది మృతి చెందారు. ఇంకా 71 మంది రోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరణాలకు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, మందుల కొరత కారణం కాదని.. రోగులకు సరైన వైద్యం అందించినా వారు కోలుకోలేదని చెప్పారు ఆస్పత్రి డీన్ శామ్‌రావ్.
ప్రభుత్వ ఆస్పత్రిలో ఏకంగా 31మంది చనిపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రచారం తప్ప.. ప్రజల కోసం బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమంటూ మండిపడ్డారు. నాందేడ్ ఆస్పత్రి ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్‌లో ఘాటుగా స్పందించారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో శివసేన ఎంపీ హేమంత్ పాటిల్ శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే ఆస్పత్రి డీన్ శ్యామ్‌రావ్ వాకోడేను పిలిపించి అపరిశుభ్రతపై గట్టిగా నిలదీశారు.
అంతటితో ఆగకుండా డీన్‌తోనే మరుగుదొడ్లను శుభ్రం చేయించారు. ఎంపీ పైపుతో గోడలపై నీళ్లు కొడుతుండగా.. డీన్ వైపర్‌తో మరుగుదొడ్లను శుభ్రం చేశాడు. ఆస్పత్రి డీన్‌తో ఎంపీ మరుగుదొడ్లు కడిగించడంపై వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎంపీ తీరుపై మిశ్రమంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా.. 48 గంటల్లోనే ఇంతమంది ప్రజల ప్రాణాలు కోల్పోవడం అనేది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. మరి ఈ టనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..








