కేరళలోని ఓ గ్రామంలోని భూమి లోపలి నుంచి భారీ శబ్దాలు వస్తు్ండటం కలకలం రేపుతోంది. గతకొన్ని రోజుల నుంచి తరచుగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గరవుతున్నారు. సమాచారం మేరకు అప్రమత్తమైన స్థానిక యంత్రాంగం ఈ మిస్టరీ శబ్దాలకు కారణాలు తెలుసుకునేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. వివరాల్లోకి వెళ్తే కొట్టయం జిల్లాలోని చెన్నపాడి అనే కుగ్రామంలో శుక్రవారం నాడు తెల్లవారుజామున రెండసార్లు భారీగా శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. అలాగే ఈవారం ప్రారంభంలో కూడా చెన్నపాడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి శబ్దాలే వచ్చినట్లు పేర్కొన్నారు.
అయితే దీనిపై కేరళ గనులు, భూగర్భ శాఖ అధికారులు స్పందించారు. త్వరలోనే నిపుణుల బృందం ఈ ప్రాంతంలో పర్యటించి పరిశోధనలు చేస్తుందని తెలిపారు. అయితే కొద్ది రోజుల క్రితం మొదటిసారి ఈ శబ్దాలు వినిపించినప్పుడే ఈ ప్రాంతాన్ని పరిశీలించామని… కానీ ధ్వనుల ఆనవాళ్లు దొరకలేవని చెప్పారు. త్వరలోనే మా సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ బృందం అక్కడకు వెళ్తుందని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..