My India My Life Goals: నిత్య యజ్ఞంలా గంగా ప్రక్షాళన.. 9ఏళ్ల నుంచి రాజేష్ శుక్లా దినచర్య ఏంటంటే..?
Rajesh Shukla Inspirational Story: పర్యావరణాన్ని రక్షిస్తేనే భవిష్యత్తును కాపాడుకోగలం.. అందుకే.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. భవిష్యత్తును కాపాడుకుందాం.. అని పిలుపునిస్తోంది టీవీ9 నెట్‌వర్క్.. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భారత ప్రభుత్వం..

Rajesh Shukla Inspirational Story: పర్యావరణాన్ని రక్షిస్తేనే భవిష్యత్తును కాపాడుకోగలం.. అందుకే.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. భవిష్యత్తును కాపాడుకుందాం.. అని పిలుపునిస్తోంది టీవీ9 నెట్‌వర్క్.. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భారత ప్రభుత్వం.. పర్యావరణ పరిరక్షణ కోసం.. ‘‘మై ఇండియా – మై లైఫ్ గోల్స్ పేరుతో.. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ మూవ్‌మెంట్’’ అనే నినాదంతో ప్రకృతిని రక్షించే ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో టీవీ9 కూడా భాగస్వామ్యంగా ఉంది. అయితే, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న మహోన్నతమైన వ్యక్తులను గుర్తించి.. వారిని ఆదర్శంగా తీసుకోని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని టీవీ9 పిలుపునిస్తోంది. ఈ ఉద్యమంలో మరో గ్రీన్ వారియర్ ను పరచయం చేస్తున్నాం.. ఆయనే ఉత్తర ప్రదేశ్ వారణాసికి చెందిన రాజేష్ శుక్లా.. 9ఏళ్ల క్రితం పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించిన రాజేష్ శుక్లా.. గంగానది పరిరక్షణ – ప్రక్షాళనకు పాటుపడుతున్నారు. పవిత్ర గంగా నదిలో వ్యర్థాలను ఏరివేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
గంగా కార్యకర్త రాజేష్ శుక్లా తన కార్యకర్తల బృందంతో కలిసి ప్రతిరోజూ ఘాట్‌ల వెంబడి గంగానదిని శుభ్రపరుస్తారు. శుక్లా తన బృందంతో కలిసి దశాశ్వమేధ ఘాట్‌ను శుభ్రపరిచేటప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లు, పాత బట్టలు, పాలిథిన్‌తో సహా వ్యర్థాలను సేకరిస్తాడు. వారు సేకరించిన వ్యర్థాలను ఘాట్ మెట్ల వద్ద ఉంచుతారు. తరువాత పారిశుధ్య కార్మికుల బృందం వాటిని తీసుకొని డంపింగ్ యార్డుకు తీసుకువెళుతుంది. ఆయన చేసే పని గాంగాను పరిరక్షించడంతోపాటు.. పచ్చదనాన్ని, పర్యావరణాన్ని కాపాడుతుంది.
అందరం కలిసి పర్యావణ పరిరక్షణ కోసం పోరాడితేనే.. పర్యావరణం మెరుగుపడుతుందని.. అప్పుడే ఆరోగ్య భారతం ఆవిష్కృతమవుతుందని రాజేష్ శుక్లా పేర్కొంటున్నారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు రాజేష్ శుక్లా తన బృందంతో కలిసి క్లీనింగ్ ఆపరేషన్ నిర్వహించడానికి గంగా నది ఒడ్డుకు చేరుకుని.. క్లీన్ గంగా కోసం కృషిచేస్తున్నారు. గంగలో వ్యర్థాలను పారవేయద్దని.. పర్యావరణాన్ని కాపాడలంటూ రాజేష్ జనాన్ని జాగృతం చేస్తున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం..