సభ్య సమాజానికి సాయం చేద్దాం.. దేశ ప్రగతిలో భాగస్వాములవుదాం.. భావితరాలకు బాసటగా నిలుద్దాం..

సభ్య సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారు.. తోటివారికి అండగా నిలుస్తున్నారు.. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ఎదురుచూడకుండా.. తమ స్వశక్తితో..

  • Ravi Kiran
  • Publish Date - 7:31 am, Tue, 26 January 21
సభ్య సమాజానికి సాయం చేద్దాం.. దేశ ప్రగతిలో భాగస్వాములవుదాం.. భావితరాలకు బాసటగా నిలుద్దాం..

సభ్య సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారు.. తోటివారికి అండగా నిలుస్తున్నారు.. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ఎదురుచూడకుండా.. తమ స్వశక్తితో ఇతరులకు సహయపడుతూ.. దేశాసేవలో తమ జీవితాలను అంకితం చేస్తున్నారు. ఇంజనీరింగ్ చదివిన ఆకాశ్ తనలాంటి కొందరు యువత సహయంతో ఢిల్లీలోని మురికివాడల్లోని పిల్లలకు చదువులు నేర్పిస్తున్నాడు. దాదారావు బిల్హోరే.. రోడ్డు మీద ఉన్న ఓ గుంత కారణంగా తన 16 ఏళ్ళ కొడుకును పోగొట్టుకున్నాడు.

దీంతో తనలాంటి బాధ ఇంకా ఎవరు పడకుడదనే మూడు సంవత్సరాలలో ఆరువందలకు పైగా గుంతలను తన సొంత ఖర్చుతో పూడ్చేశాడు. వీరిద్దరితోపాటు పంకజ్.. ఢిల్లీ రహదారుల పక్కన నిల్చోని పర్వావరణ పరిరక్షణ గురించి తెలుపుతూ.. కేవలం రెండు సంవత్సరాలలో లక్షలాది మొక్కలు నాటేలా చేసాడు. ఇలా లక్షలాది మంది ప్రభుత్వ సహయం కోసం ఎదురు చూడకుండా.. సొంత శక్తితో దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారు. కానీ 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఈ సంఖ్య చాలా తక్కువ. అందుకే ఈ గణతంత్ర దినోత్సవం రోజున మనందరం కర్తవ్యాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తామని శపథం చేద్దాం. వారిలాగే మీరు కూడా ఏదైనా సమాజ సేవలు చేసినట్లైయితే.. మీరు చేసిన ఆ సేవలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఫేస్‏బుక్‏లో #MyIndiaMyDutyతో షేర్ చేయండి. అలాగే TV9 తెలుగు పేజీతో ట్యాగ్ చేయండి.