Special Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. 27వ తేదీ నుంచి పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
Special Train: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కాచిగూడ-యలహంక ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు..
Special Train: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కాచిగూడ-యలహంక ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 27వ తేదీ నుంచి ఈ రైలు నడుస్తుందని తెలిపారు. అదే విధంగా తిరుగు ప్రయాణంలో యలహంక- కాచిగూడ ఈ నెల28 నుంచి ప్రతి రోజు నడుస్తుందని వెల్లడించారు. కాచిగూడలో రాత్రి 9.05 గంటలకు బయలుదేరి యలహంకకు మరుసటి రోజు ఉదయం 9.35 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు కాచిగూడ నుంచి బయలుదేరి షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, ద్రోణాచలం, గుంతకల్ , అనంతపురం, ధర్మవరం, పెనుగొండ, హిందూపూర్‌ల మీదుగా గౌరిబిదనూరు, దోడ్‌బల్లాపూర్ స్టేషన్‌ల మీదుగా రాకపోకలు సాగిస్తుందని అధికారులు వెల్లడించారు.
అలాగే సికింద్రాబాద్- మణుగూరు, మణుగూరు- సికింద్రాబాద్, గుంటూరు- రాయగడ, తిరుపతి- ఆదిలాబాద్, ఆదిలాబాద్ – తిరుపతి, కాకినాడ పోర్టు – రేణిగుంట రైళ్లు ఈనెల 27 నుంచి ప్రతిరోజు నిర్దేశిత మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు. అయితే ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని తెలిపారు.