దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవం.. యావత్ భారతావనికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మంగళవారం ఉదయం ‘జైహింద్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
Indian republic day 2021: 72వ గణతంత్ర దినోత్సవంతో భారతావని పులకించిపోతోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మంగళవారం ఉదయం ‘జైహింద్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలను పలకరిస్తూ అభినందనలు తెలిపారు. కొవిడ్-19 మహమ్మారి మధ్య నిర్వహిస్తున్న గణతంత్ర దినోత్సవం ముఖ్య అతిథి లేకుండా తక్కువ మందితో కవాతు సాగింది. కొవిడ్ ప్రోటోకాల్ మధ్య రిపబ్లిక్ డే ఉత్సవాల్లో రాఫెల్ ఫైటర్ జెట్ లు, టి-90 ట్యాంకులు, సామ్ విజయ్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్, సుఖోయ్-30 విమానాలు, ఎంకేఐ ఫైటర్ జెట్ లు విన్యాసాలు సాగించేందుకు సిద్ధమయ్యాయి. ఈమేరకు ప్రధాని మోదీ హిందీలో ట్వీట్ చేశారు.
देशवासियों को गणतंत्र दिवस की ढेरों शुभकामनाएं। जय हिंद!
Wishing all the people of India a Happy #RepublicDay. Jai Hind!
— Narendra Modi (@narendramodi) January 26, 2021
గణతంత్ర వేడుకలకు ఇతర దేశాధినేతలు అతిథులుగా రావటం పరిపాటి. అయితే ఈసారి మాత్రం రిపబ్లిక్ డే అతిథి లేకుండానే జరగనుంది. 72వ గణతంత్ర దినోత్సవం నిర్వహించేందుకు దిల్లీలో సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ఎన్నికైన తర్వాత జరిగే రెండో గణతంత్ర వేడుకల్లో ఈసారి అతిథులు ఎవరూ హాజరుకావడం లేదు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ను తొలుత ఆహ్వానించినప్పటికీ.. యూకేలో కరోనా కొత్త వైరస్ విజృంభిస్తున్న కారణంగా ఆయన ప్రయాణం రద్దయింది.
Read Also… సభ్య సమాజానికి సాయం చేద్దాం.. దేశ ప్రగతిలో భాగస్వాములవుదాం.. భావితరాలకు బాసటగా నిలుద్దాం..