Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. ఇద్దరు కానిస్టేబుళ్ల దారుణంగా హత్య చేసిన దుండగులు.. పోలీసుల గాలింపు

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. సుక్మా జిల్లాలో ఇద్దరు పోలీసులు దారుణ హత్యకు గురయ్యారు. హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ గొంతుకోసి దుండగులు దారుణంగా.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. ఇద్దరు కానిస్టేబుళ్ల దారుణంగా హత్య చేసిన దుండగులు.. పోలీసుల గాలింపు
Follow us
Subhash Goud

|

Updated on: Apr 16, 2021 | 6:12 AM

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. సుక్మా జిల్లాలో ఇద్దరు పోలీసులు దారుణ హత్యకు గురయ్యారు. హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ గొంతుకోసి దుండగులు దారుణంగా హత్య చేశారు. బెజ్జి పోలీస్‌స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్‌ కానిస్టేబుళ్లు పూనెం హరీమ్‌ (30), ధనిరాం కశ్యప్‌ (31) ద్విచక్ర వాహనంపై సమీపంలోని ఓ గ్రామంలో ఉన్న వైద్యశాలకు పనిపై వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా.. మార్గమధ్యలో ద్విచక్ర వాహనాన్ని అటకాయించిన గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు పాల్పడిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే హత్య చేసింది ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుడు హరీమ్‌ దంతెవాడ జిల్లా నేతల్‌నార్‌ గ్రామానికి చెందిన వారు కాగా, కశ్యప్‌ సుకుమా జిల్లా జేగురుగొండ గ్రామానికి చెందిన వ్యక్తి. వీరిని మావోయిస్టులు హతమార్చారా? లేక వ్యక్తిగత కక్షల కారణంగా మరెవరైనా హతమార్చారా..?అన్న కోణంలో విచారణ చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు.

కాగా, ఈనెల 3న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో భీకర ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 20 మందికిపైగా భద్రత సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు జవాన్లకు గాయాలయ్యాయి. బీజాపూర్ జిల్లాలోని తార్రెమ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా అధికారులకు సమాచారం అందించింది. ఇదే క్రమంలోనే అడవులను భద్రతా సిబ్బంది జల్లెడ పడుతున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన నాటి నుంచి మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఇవీ చదవండి: Former Minister Chandulal: కరోనాతో మాజీ మంత్రి చందూలాల్‌ కన్నుమూత.. మూడు సార్లు శాసనసభకు, రెండు సార్లు లోక్‌సభకు..

Visakha murders : అప్పలరాజు కుటుంబంపై బాధిత బంధువుల ఆగ్రహావేశాలు, ఆరు హత్యల వెనుక కారణాలు..

Pendurthi Murder Case: అప్పలరాజే నిందితుడు.. పాత కక్షలతో అత్యంత దారుణంగా ఆరుగురి హత్య..