AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traffic Signal: మీరు మారరా..! హెల్మెట్‌ పెట్టుకోరు.. సిగ్నల్‌ పడినా పట్టించుకోరూ..పైగా..

జరిగిన ఘటన మొత్తాన్ని అక్కడి స్థానికులు తమ సెల్‌ఫోన్‌ కెమెరాల్లో రికార్డ్ చేసి సోసల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయటంతో వీడియో వెంటనే వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా ఇద్దరు నిందితుల్లో ఒకరిని పోలీసులు ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు.

Traffic Signal: మీరు మారరా..! హెల్మెట్‌ పెట్టుకోరు.. సిగ్నల్‌ పడినా పట్టించుకోరూ..పైగా..
Traffic Cop
Jyothi Gadda
|

Updated on: Mar 13, 2023 | 2:31 PM

Share

పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ వాహనదారులు మాత్రం ట్రాఫిక్‌ రూల్స్‌ ఏవేమీ పట్టించుకోకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తుంటారు. సిగ్నల్‌ జంప్‌ చేయటం, హెల్మెట్‌ లేకుండా ప్రయాణించటం వంటివి చేస్తూ పలుమార్లు ఫైన్లు కడుతుంటారు. అలా సిగ్నల్‌ జంప్‌ చేసిన ఇద్దరు యువకులు ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకోవటంతో రెచ్చిపోయి ప్రవర్తించారు. ట్రాఫిక్‌ కానిస్టేబుల్స్‌ పైనే దాడికి పాల్పడ్డారు. ఈ షాకింగ్‌ ఘటన ముంబైలోని కుర్లా ప్రాంతంలో చోటు చేసుకుంది. కుర్లా ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ జంప్‌ చేసి హెల్మెట్‌ లేకుండా వాహనం నడుపుతున్నందుకు ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నాడు.

కుర్లా పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రాకేష్ రమేష్ ఠాకూర్ (36) శనివారం సాయంత్రం కుర్లా పశ్చిమ ప్రాంతంలోని ఎల్‌బిఎస్ రోడ్డులోని కుర్లా డిపో సిగ్నల్ దగ్గర డే డ్యూటీ చేస్తున్నాడు. అంతలోనే ఇద్దరు రైడర్లు హెల్మెట్‌ లేకుండా సిగ్నల్ జంప్ చేసి వేగంగా వెళ్తుండటం గమనించాడు. దాంతో రాకేష్‌ రమేష్‌ ఠాకూర్‌ వారిని అడ్డుకుని మందలించటంతో వారు మరింత ఆగ్రహానికి గురయ్యారు.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పైనే దాడికి పాల్పడ్డారు. అయితే, ఠాకూర్‌తో వాదించడం ప్రారంభించారు. ఇ-చలాన్ ద్వారా తమకు జరిమానా విధించవద్దని డిమాండ్ చేశారు. ఠాకూర్ ముందుకు వెళ్లి ఇ-చలాన్ కెమెరాలో వారిని ఫోటో తీస్తుండటంతో వారు అతనిపై దాడి చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనకు సంబంధించి సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర హొవాలే తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు నిందితులు, కొంతమంది స్థానికులతో కలిసి అక్కడ ఆపి ఉంచిన ద్విచక్ర వాహనాలపై పడిన ఠాకూర్‌ను నెట్టడం, కొట్టడం మొదలుపెట్టారు. అయితే, ఠాకూర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఠాకూర్ వెంటనే కుర్లా పోలీసులను సంప్రదించి గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

కాగా, జరిగిన ఘటన మొత్తాన్ని అక్కడి స్థానికులు తమ సెల్‌ఫోన్‌ కెమెరాల్లో రికార్డ్ చేసి సోసల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయటంతో వీడియో వెంటనే వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా ఇద్దరు నిందితుల్లో ఒకరిని కుర్ల పోలీసులు ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. నిందితుడిని మహీం నివాసి ఖలీద్ ఇసాక్ వసీకర్ (53)గా గుర్తించారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ