Mumbai Horror: మహారాష్ట్రంలోని అంధేరీలో దారుణాతిదారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికకు కామోద్దీపన ఇంజెక్షన్లు ఇచ్చి.. దాదాపు ఏనిమిదేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు ఓ దుర్మార్గుడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. అంధేరి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక ప్రస్తుతం ఇంటర్మీడియట్ చవుదుతోంది. ఆయితే, ఆ బాలికకు పొరుగున ఉన్న వ్యక్తి.. గత ఎనిమిదేళ్లుగా కామోద్దీపన కలిగించే ట్యాబ్లెట్లు, ఇంజెన్లు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సందర్భంగా తీసిని వీడియోను చూపెడుతూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు.
దాంతో ఏనిమిదేళ్లుగా భరిస్తూ వచ్చిన ఆ బాలిక.. ఇక ఆ వేధింపులు తాళలేక తన కుటుంబ సభ్యులకు విషయం మొత్తం చెబుతూ 27 పేజీల లేఖను రాసింది. బాలికపై అత్యాచారారినిక పాల్పడిన వ్యక్తికి ఇంతకు ముందే వివాహం కూడా జరిగింది. బాలికపై అత్యాచారం విషయం అతని భార్యకు కూడా తెలుసు. అంతేకాదు.. బాలికపై అత్యాచారం చేసిన వారిలో ఆమె మామ, అతని కుమారుడు(19) కూడా ఉన్నట్లు బాలిక తన లేఖలో రాసింది. వీడియో క్లిప్ అడ్డుపెట్టుని నిత్యం బెదిరింపులకు పాల్పడేవారని బాలిక తన గోడు వెల్లబోసుకుంది. ఆ నోట్ ఆధారంగా బాలికు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపిస్తున్నారు.
Also read: