గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ఎంపీ శశి థరూర్

ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఎంపీ శశి థరూర్ పాల్గొన్నారు. ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో శశి థరూర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యం కావడం చాలా..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ఎంపీ శశి థరూర్

Edited By:

Updated on: Aug 23, 2020 | 1:56 PM

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేయించడం జరుగుతుంది.

తాజాగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఎంపీ శశి థరూర్ పాల్గొన్నారు. ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో శశి థరూర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు ఒక నిజమైన ఛాలెంజ్.

ఎందుకంటే ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇకనైనా దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి మొక్కలు నాటి.. గ్రీన్ ఇండియాగా మార్చాలన్నారు. ఈ అవకాశం కల్పించిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు శశి థరూర్. అలాగే ఈ ఛాలెంజ్‌ను కర్ణాటక రాజ్యసభ సభ్యులు జయరామ్ రమేష్ , బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా ,బీజేపీ దేశ ఉపాదాక్ష్యులు & స్పోక్స్ పర్సన్ బైజయంత్ జయ్ పాండా , అమృత్సర్ ఎంపీ గుర్జిత్ సింగ్ ఔజ్ల , వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు విసిరారు ఎంపీ శశిథరూర్.

Read More:

ఖైరతాబాద్‌లో పెరిగిన రద్దీ.. సెల్ఫీల కోసం జనాల పోటీ

ఇంకా కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ.. మారని పరిస్థితి

బ్రేకింగ్: సినిమా షూటింగులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అర్చకుడి క్రైమ్ కథ.. ప్రేయసి కోసం చంపేసి ఆలయంలోనే పూడ్చాడు