AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్న కొడుకు క్రూరత్వం.. డబ్బుల కోసం వేధించి.. రాయితో కొట్టి

పచ్చని జీవితంలో మద్యం(Wine) మత్తు చిచ్చురేపుతోంది. మత్తు ఉచ్చులో పడి బంగారు భవిష్యత్ ను అంధకారంలో పడేస్తున్నారు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలంటూ కొందరు వేధింపులకూ..

కన్న కొడుకు క్రూరత్వం.. డబ్బుల కోసం వేధించి.. రాయితో కొట్టి
Wife Murder
Ganesh Mudavath
|

Updated on: Feb 28, 2022 | 5:40 PM

Share

పచ్చని జీవితంలో మద్యం(Wine) మత్తు చిచ్చురేపుతోంది. మత్తు ఉచ్చులో పడి బంగారు భవిష్యత్ ను అంధకారంలో పడేస్తున్నారు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలంటూ కొందరు వేధింపులకూ పాల్పడుతున్నారు. చిన్న చిన్న కారణాలకే విచక్షణ కోల్పోతున్నారు. ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితికి చేరుకుంటున్నారు. మద్యం కోసం రక్తసంబంధీకులనూ హత్య చేయడం ప్రస్తుతం పరిపాటిగా మారింది. తీరా అసలు విషయం తెలిసే నాటికే పరిస్థితి చేయి దాటి పోతోంది. తాజాగా బెంగళూరులో జరిగిన ఓ ఘటన ఆవేదన కలిగిస్తోంది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే ఓ కుమారుడు కర్కశంగా కొట్టి చంపాడు(Murder). కర్ణాటకలోని రాయచూరు ప్రాంతానికి చెందిన యమునమ్మ తన కుమారుడు అంబరీశ్ తో కలిసి.. బెంగళూరు(Bangalore) దేవరబీసనహళ్లిలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అంబరీశ్ మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తల్లి యమునమ్మను తరచూ వేధించేవాడు. డబ్బుల కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేయాలని తల్లిని బలవంతం చేసేవాడు.

ఆదివారం రాత్రి కూడా డబ్బులు కావాలని యమునమ్మను అడిగాడు. డబ్బును ఇతర అవసరాల కోసం ఉంచానని, మద్యం తాగేందుకు ఆమె తేల్చి చెప్పింది. ఇరువురి మధ్య కొంతసేపు ఘర్షణ జరిగింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన అంబరీశ్.. యమునమ్మను ఇంటి నుంచి బయటకు తోసేశాడు. ఆమె తలపై రాయితో కొట్టాడు. ఈ ఘటనలో యమునమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read