AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chennai: వామ్మో.. చల్లటి గాలి నీచ్చే ఏసీ ప్రాణాలనే మింగేసింది. తల్లి, కూతుళ్లు…

చెన్నైలోని అంత్తూరులో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. శనివారం తెల్ల వారుజామున ఇంట్లో ఎయిర్‌ కండీషనర్‌ (ఏసీ) పేలడంతో తల్లి, కూతురు మరణించారు. ఏసీ పేలడంతో చెలరేగిన మంటలతో ఇద్దరు సజీవదహనమయ్యారు. చెన్నైలోని అంబత్తూర్‌లో హలీనా (50), కూతురు నస్రియా (16) ఇందిరా నగర్‌ సమీపంలోని మేనంపేడులోని ఓ ఇంట్లో నిద్రిస్తున్నారు. అయితే రాత్రి పూట ఇద్దరూ నివసిస్తున్న సమయంలో...

Chennai: వామ్మో.. చల్లటి గాలి నీచ్చే ఏసీ ప్రాణాలనే మింగేసింది. తల్లి, కూతుళ్లు...
Representative Image
Narender Vaitla
|

Updated on: Sep 30, 2023 | 7:48 PM

Share

ఒక చిన్న ప్రమాదం నిండు ప్రాణాలను బలి తీస్తుంది. ఏ క్షణంలో ఏది జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంట్లో ఉండే నిత్యవసర వస్తువులే మనుషుల ప్రాణాలను తీస్తున్న సంఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. ఫ్రిడ్జ్‌ పేలిన సంఘటనలు, గ్యాస్‌ సిలిండర్‌ పేలిన సంఘటనలు దేశ వ్యాప్తంగా ఏదో ఒక చోటు చేసుకుంటూనే ఉంది. తాజాగా ఇలాంటి ఓ ఘటనే చెన్నైలో జరిగింది. చల్లటి గాలిని ఇచ్చే ఏసీ రెండు ప్రాణాలను బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

చెన్నైలోని అంత్తూరులో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. శనివారం తెల్ల వారుజామున ఇంట్లో ఎయిర్‌ కండీషనర్‌ (ఏసీ) పేలడంతో తల్లి, కూతురు మరణించారు. ఏసీ పేలడంతో చెలరేగిన మంటలతో ఇద్దరు సజీవదహనమయ్యారు. చెన్నైలోని అంబత్తూర్‌లో హలీనా (50), కూతురు నస్రియా (16) ఇందిరా నగర్‌ సమీపంలోని మేనంపేడులోని ఓ ఇంట్లో నిద్రిస్తున్నారు. అయితే రాత్రి పూట ఇద్దరూ నివసిస్తున్న సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఎయిర్‌ కండిషనర్‌లో పేలుడు సంభవించింది.

దీంతో ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. గది మొత్తం మంటలతో నిండిపోవడంతో తల్లీకూతుళ్లు ఇద్దరు అగ్నికి ఆహుతి అయ్యారు. అర్థరాత్రి కావడం, చుట్టు పక్కల వాళ్లు కూడా గమనించకపోవడంతో ఇద్దరు మరణించారు. మంటలు శరవేగంగా వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగిందని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. అయితే కాసేపటి తర్వాత ఇంట్లో నుంచి భారీగా పొగలు రావడాన్ని గమనించిన ఇరుగుపొరుగు ప్రజలు వెంటనే ఫైర్‌ ఇంజన్‌కు సమాచారం అందించారు.

Ac

అయితే సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూశారు. అయితే అప్పటికే తల్లీకూతుళ్లు ఇద్దరు మరణఙంచినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. పోలీసులు తల్లీకూతుళ్ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక విచారణ మేరకు ఏసీలో ఏర్పడ్డ షార్ట్ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయని, భారీగా వచ్చిన పొగ కారణంగా ఊపిరాడక చనిపోయారని తెలుస్తోంది. ఈ ఘనపై కేసు నమోదు చేసుకున్న అంబత్తూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..