అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట్లో విందు అంటే ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆ కుటుంబం ఏర్పాటు చేసిన కల్చరల్ సెంటర్ లాంచింగ్ ఈవెంట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరుగుతున్న ఈ ఈవెంట్ లో పలువురు ప్రముఖులు, సినీ తారలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అయితే, ఈ పార్టీలో గెస్టులకు విందులో స్వీట్ తోపాటు రూ.500 కరెన్సీ నోట్లు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ యూజర్ షేర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రతనిశ్ అనే ట్విట్టర్ యూజర్ ఓ ట్వీట్ చేశాడు. అతడు షేర్ చేసిన ఫోటోలో సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఓ ఫుడ్ ఐటమ్ తోపాటు కరెన్సీ నోట్లూ పెట్టి కనిపించాయి. వాటిని పేర్కొంటూ.. రతనీశ్ ఆ ఫొటోకు ఒక క్యాప్షన్ పెట్టాడు. అంబానీ పార్టీలో ఫుడ్ ఐటమ్‌తో టిష్యూ పేపర్‌కు బదులు రూ. 500 నోట్లు ఉంటాయి.. అని రాసుకున్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్విట్ చూసిన ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా స్పందించారు. అయితే, ఇది నిజం కాదు. ఇది ఒక రకమైన డిష్ అని ఆ తర్వాత తెలిసింది. డిజర్ట్‌తో కనిపిస్తున్నవి నిజమైన కరెన్సీ నోట్లు కావు. అవి ఫేక్ కరెన్సీ నోట్లు. అదేంటంటే..
Ambani ji ke party mein tissue paper ki jagah 500 ke notes hote hain ? pic.twitter.com/3Zw7sKYOvC
— R A T N I S H (@LoyalSachinFan) April 2, 2023
ఢిల్లీలో ఓ రిచ్ డైనింగ్ అందించే ఇండియన్ అస్సెంట్ అనే రెస్టారెంట్‌లో అందించే డిష్ అది. ఈ డిష్ పేరు దౌలత్ కీ చాట్. ఈ డిష్‌ను అంబానీ పార్టీలో సర్వ్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇండియన అస్సెంట్ రెస్టారెంట్ దౌలత్ కీ చాట్ అనే డిజర్ట్ అందిస్తున్నది. దీన్ని డిజర్ట్ ఆఫ్ ది రిచెస్ అని కూడా పిలుస్తారు. ఈ డిజర్ట్ అందించే కప్‌లో ఫేక్ కరెన్సీ నోట్లనూ పెట్టి రిచ్‌గా ప్రొజెక్ట్ చేస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..