Trump: గుజరాత్‌లో ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా..? RTI ప్రశ్నకు సమాధానం ఇదే..
డొనాల్డ్ ట్రంప్ 36 గంటల రాష్ట్ర పర్యటనకు కేంద్రం దాదాపు రూ. 38 లక్షలు ఖర్చు చేసిందని మిషాల్ భతేనా ఆర్టీఐ ద్వారా వెల్లడించారు. ఈ ఖర్చులో వసతి, భోజనం, లాజిస్టిక్స్ మొదలైనవి ఉన్నాయని..

2020లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుజరాత్ పర్యటన అందరి దృష్టిని ఆకర్షించింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రంప్‌కు అహ్మదాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగని ఈ పర్యటకు కేంద్ర ప్రభుత్వం భారీ ఖర్చు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆర్టీఏ కార్యకర్త మిషాల్ భతేనా అమెరికా మాజీ అధ్యక్షుడి గుజరాత్ పర్యటకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందన్న వివరాలను రాబట్టారు. ట్రంప్ పర్యటనకు కేంద్రం రూ. 38 లక్షలు ఖర్చు చేసినట్లుగా వెల్లడయ్యింది. ఈ ఖర్చులో వసతి, భోజనం, లాజిస్టిక్స్ మొదలైనవి ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ కేంద్ర సమాచార కమిషన్‌కు తెలియజేసినట్లు పిటిఐ వార్తా సంస్థ నివేదించింది.
భారతదేశానికి తన తొలి అధికారిక పర్యటనలో ట్రంప్ తన భార్య మెలానియా, కుమార్తె ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్, పలువురు ఉన్నతాధికారులతో కలిసి , 2020 ఫిబ్రవరి 24-25 తేదీలలో అహ్మదాబాద్, ఆగ్రా, న్యూఢిల్లీలను సందర్శించారు. ఫిబ్రవరి 24న అహ్మదాబాద్‌లో మూడు గంటలు గడిపిన ఆయన 22 కిలోమీటర్ల రోడ్‌షోలో పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.
కొత్తగా నిర్మించిన మోటెరా క్రికెట్ స్టేడియంలో జరిగిన “నమస్తే ట్రంప్” అనే మెగా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ప్రసంగించారు. అనంతరం తాజ్ మహల్‌ను సందర్శించారు. ఫిబ్రవరి 25న దేశ రాజధానిని సందర్శించిన ఆయన అక్కడ మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.




ఆహారం, భద్రత, గృహాలు, విమానాలు, రవాణా ఖర్చులతో సహా, ఫిబ్రవరి 2020లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు, ప్రథమ మహిళ పర్యటన సందర్భంగా భారత ప్రభుత్వం మొత్తం ఎంత ఖర్చు చేసిందనే ప్రశ్నలు ఉన్నాయి. భారత పర్యటనలో ఉన్న ట్రంప్ కోసం కేంద్ర సర్కారు ఎంత ఖర్చు చేసిందన్న విషయంపై ఆర్టీఐ ద్వారా మిషాల్ భతేనా అనే వ్యక్తి వివరాలు అడగగా అందుకు కేంద్ర విదేశాంగ శాఖ సమాధానం ఇచ్చింది.
అక్టోబరు 24, 2020న దరఖాస్తును దాఖలు చేసిన ప్రశ్నలకు ఎటువంటి స్పందన రాలేదు. దాని తర్వాత మరోసారి అప్పీల్‌ను దాఖలు చేశారు. దీంతో సమాచార కమిషన్ ను ఆశ్రయించారు. కరోనా వల్ల సమాచారం ఇవ్వడంలో ఆలస్యమైందని కేంద్ర సర్కారు చెప్పింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం