AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ రాష్ట్రపతి.. అమిత్‌షా ప్రధాని.. బీజేపీ2024 ప్లాన్

వరుసగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నరేంద్ర మోదీ నెక్స్ట్ లెవెల్‌ పదవిపై కన్నేశారా? ఏ పదవిని మూడోసారి ఒకే వ్యక్తి చేపట్టే ఛాన్స్ బీజేపీ తమ నేతలకు ఇవ్వదు. దాంతో నెక్స్ట్ లెవెల్ పోస్ట్ మీద నరేంద్ర మోదీ కన్నేశారని, అందుకు అనుగుణంగా పావులు కదపడం కూడా మొదలైందని రాజకీయ పరిశీలకులు అంఛనా వేస్తున్నారు. అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల యాక్షన్ ప్లాన్‌లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా అమిత్‌షాను ప్రమోట్ చేసే ఛాన్స్ వుందని అంఛనా […]

మోదీ రాష్ట్రపతి.. అమిత్‌షా ప్రధాని.. బీజేపీ2024 ప్లాన్
Rajesh Sharma
|

Updated on: Feb 07, 2020 | 11:25 AM

Share

వరుసగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నరేంద్ర మోదీ నెక్స్ట్ లెవెల్‌ పదవిపై కన్నేశారా? ఏ పదవిని మూడోసారి ఒకే వ్యక్తి చేపట్టే ఛాన్స్ బీజేపీ తమ నేతలకు ఇవ్వదు. దాంతో నెక్స్ట్ లెవెల్ పోస్ట్ మీద నరేంద్ర మోదీ కన్నేశారని, అందుకు అనుగుణంగా పావులు కదపడం కూడా మొదలైందని రాజకీయ పరిశీలకులు అంఛనా వేస్తున్నారు. అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల యాక్షన్ ప్లాన్‌లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా అమిత్‌షాను ప్రమోట్ చేసే ఛాన్స్ వుందని అంఛనా వేస్తున్నారు.

బీజేపీ నియమావళి ప్రకారం ఏ పదవిని ఒకే వ్యక్తి రెండోసారి చేపట్టే అవకాశం లేదు. అందుకే అమిత్‌షా బీజేపీ అధినేత పదవి నుంచి తప్పుకుని జేపీ నడ్డాకు ఇటీవల పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇది పార్టీ నియమావళి. కానీ ప్రభుత్వ అధినేతల పోస్టులకు ఇది వర్తించాలన్న రూలేం లేదు. 2024లో మరోసారి బీజేపీ అనే నినాదంతో కార్యాచరణ అమలు చేస్తున్న బీజేపీ అధిష్టానం నరేంద్ర మోదీని రాష్ట్రపతి పదవికి, అమిత్‌షాను ప్రధాన మంత్రి పదవికి ప్రతిపాదించబోతున్నారని సమాచారం. గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడో దఫా కొనసాగుతున్న తరుణంలోనే నరేంద్ర మోదీ జాతీయ నేతగా ప్రమోట్ అవడం.. అదే ఊపులో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. సో.. ప్రధాన మంత్రి పదవిని మోదీ మూడో సారి చేపట్టబోరనడానికి కూడా వీలు లేదు. అయితే.. సుదూర లక్ష్యంతో మోదీ రూటు మార్చారన్న ప్రచారం జరుగుతోంది.

కానీ, నరేంద్ర మోదీ ప్రత్యేక కార్యాచరణలో భాగంగానే రాష్ట్రపతి పదవిపై కన్నేశారని పరిశీలకులు అంఛనా వేస్తున్నారు. పూర్తి సైనికాధికారలతో రాష్ట్రపతి పదవిలో కొనసాగడం ద్వారా దేశంలో కొత్త తరహా పాలనా వ్యవస్థను తేవడమే మోదీ ఉద్దేశమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సర్వాధికారాలు కలిగిన రాష్ట్రపతిగా తాను అమెరికన్ ప్రెసిడెంట్ తరహాలో వ్యవహరించాలన్నది మోదీ వ్యూహంలో భాగమన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

దీనిని గ్రహించిన పలువురు కాంగ్రెస్, వామపక్ష నేతలు మోదీ కార్యాచరణపై అప్పుడు ప్రకటనలు చేయడం మొదలు పెట్టారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవికి పెద్దగా అధికారాలు లేని విషయం అందరికీ తెలిసిందే. త్రివిధ దళాలకు అధిపతిగా వున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రి తీసుకునే నిర్ణయాలను నేరుగా రక్షణ శాఖ ద్వారా త్రివిధ దళాలకు పంపే వెసులుబాటు వుంది. ఏ ఆదేశమైనా రాష్ట్రపతితో సంబంధం లేకుండా త్రివిధ దళాధిపతులకు ప్రధాన మంత్రి, రక్షణ శాఖ పంపుతుంది.

దాన్ని అధిగమించి.. త్రివిధదళాలపై అధికారాలను రాష్ట్రపతికి కట్టబెట్టే దిశగా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పలువురు చెప్పుకుంటున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇటీవల చేసిన ప్రకటన ఇందుకు ఓ ఉదాహరణగా భావించవచ్చు. త్రివిధదళాలకు సింగిల్ హెడ్‌గా ఓ కొత్త పోస్టును క్రియేట్ చేయడం వెనుక మోదీ దీర్ఘకాల వ్యూహం వుందన్న అంఛనాలు వినిపిస్తున్నాయి. ముగ్గురు దళాధిపతులపైన అధికారిగా ఇటీవల బిపిన్ రావత్‌ను కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఈ అధికారికి డైరెక్షన్స్ ఇచ్చే బాధ్యతలను ప్రధానమంత్రితోపాటు రాష్ట్రపతికి ఇచ్చే విషయంపై మోదీ చర్యలకు ఉపక్రమించారని చెప్పుకుంటున్నారు.

జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ సమీప భవిష్యత్తులో ఎదిగే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు జాతీయ స్థాయిలో బలమైన నేత అధినేతగా వుండాలన్న అభిప్రాయంలో మెజారిటీ దేశ ప్రజలున్నారు. అందుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలే చక్కని ఉదాహరణ. 2014లో ఢిల్లీలోని ఏడు పార్లమెంటు స్థానాల్లోను విజయం సాధించిన బీజేపీ ఆ తర్వాత ఆరు నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోను బీజేపీ ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్ సభ సీట్లను గెలుచుకుంది. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రతిపక్షానికే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

దాంతో జాతీయ స్థాయిలో బలమైన నేతగా పేరున్న నరేంద్ర మోదీనే ప్రధానిగా కొనసాగాలన్న అభిప్రాయం దేశప్రజల్లో వుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే ట్రెండ్ మరో నాలుగేళ్ళు కొనసాగితే 2024 జనరల్ ఎన్నికల్లోను బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడోసారి ప్రధాన మంత్రి పదవిని చేపట్టేందుకు మోదీ మొగ్గు చూపుతారా లేక తన అనుంగ సహచరుడు అమిత్ షాకు ప్రధాని పదవినిచ్చేసి.. తాను రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి.