ముగిసిన ప్రచార పర్వం.. హస్తినలో బీజేపీ వెర్సస్ ఆప్.!

Assembly Elections: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌లు విజయం తమదంటే.. తమదేనంటూ ప్రసంగాలు ఇస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ నెల 8వ తేదీన 70 అసెంబ్లీ స్థానాలకు గానూ పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఈ ఎన్నికలకు హస్తినలో ఉన్న సుమారు కోటిన్నర మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలు నిర్వహించేందుకు 13,463 పోలింగ్ కేంద్రాలను సిద్ధం […]

ముగిసిన ప్రచార పర్వం.. హస్తినలో బీజేపీ వెర్సస్ ఆప్.!

Assembly Elections: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌లు విజయం తమదంటే.. తమదేనంటూ ప్రసంగాలు ఇస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ నెల 8వ తేదీన 70 అసెంబ్లీ స్థానాలకు గానూ పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఈ ఎన్నికలకు హస్తినలో ఉన్న సుమారు కోటిన్నర మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇదిలా ఉంటే ఎన్నికలు నిర్వహించేందుకు 13,463 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయగా.. 90 వేల పోలీసుల భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఈ ఎన్నికలు 668 మంది అభ్యర్థుల భవిష్యత్తును తేల్చనున్నాయి. అటు న్యూఢీల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న సంగతి విదితమే.

మరోవైపు బీజేపీ, ఆప్ పార్టీలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకోనున్నట్లు కనిపిస్తోంది. ఇక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి సుమారు 10 కోట్ల డబ్బు, 90 వేల లీటర్ల మద్యం, 774 కేజీల డ్రగ్స్‌తో పాటుగా 32.18 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది.

కాగా, గత కొన్ని రోజులుగా సీఏఏ, ఎన్సార్సీలకు వ్యతిరేకంగా షాహిన్ బాగ్‌తో పాటు జామియా యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనలతో ఢిల్లీ రాజకీయం హాట్ హాట్‌గా మారింది. ఎవరు ఎన్ని సమీకరణాలు వేసిన….తుది ఫలితాలు మాత్రం ఢిల్లీ ఓటర్ల చేతుల్లో ఉంది. చూడాలి మరి ఫిబ్రవరి 11 న హస్తిన రాజు ఎవరవుతారో.?

Click on your DTH Provider to Add TV9 Telugu