Kamal Haasan: విక్రమ్‌ భారీ విజయంతో మాంచి జోష్‌లో కమల్‌.. ఆ విషయంలో తగ్గేదే లేదంటూ పవర్ ఫుల్ కామెంట్స్..

Kamal Haasan: విక్రమ్‌ విజయంతో హుషారుగా ఉన్నారు కమల్‌ హాసన్‌. తమిళనాడులో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు లోకనాయకుడు.

Kamal Haasan: విక్రమ్‌ భారీ విజయంతో మాంచి జోష్‌లో కమల్‌.. ఆ విషయంలో తగ్గేదే లేదంటూ పవర్ ఫుల్ కామెంట్స్..
Kamal Haasan
Follow us

|

Updated on: Jun 10, 2022 | 8:52 AM

Kamal Haasan: విక్రమ్‌ విజయంతో హుషారుగా ఉన్నారు కమల్‌ హాసన్‌. తమిళనాడులో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు లోకనాయకుడు. కమల్‌ హాసన్‌ మాజీ ‘రా’ ఏజెంట్‌ పాత్రలో నటించిన విక్రమ్‌ మూవీ భారీ సక్సెస్‌ అందుకుంది. టెన్‌కి నైన్‌ రేటింగ్‌ ఇచ్చింది IMDB. ఈ విజయంతో చాలా హ్యాపీగా ఉన్నారు విశ్వనటుడు. విక్రమ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌కు లగ్జరీ కారు కానుకగా ఇచ్చిన కమల్‌.. 13 మంది అసిస్టెంట్‌ డైరెక్టర్లకు తలో బైక్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ఇదే హుషారులో పాలిటిక్స్‌లో ఫ్యూచర్‌ ప్లాన్స్‌ గురించి చెప్పారు MNM పార్టీ చీఫ్‌. మక్కల్‌ నీది మయ్యం పార్టీ స్థాపించి నాలుగేళ్లు దాటిందని, పార్టీ సంస్థాగతంగా పటిష్టంగా ఎదిగిందన్నారు. తమిళనాడులో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. గత ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కమల్‌ హాసన్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.

MNM పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి ఆ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోగా ప్రజలు తిరస్కరించారు. కమల్‌ హాసన్‌ సహా ఆ పార్టీ అభ్యర్థులందరూ ఓడిపోయారు. దక్షిణ కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్‌ హాసన్‌ బీజేపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో కనీసం పార్టీ అధ్యక్షుడైనా గెలుస్తాడని గంపెడాశలు పెట్టుకున్న మక్కల్‌ నీది మయ్యమ్‌ శ్రేణులకు నిరాశ తప్పలేదు. అయినా సరే వచ్చే ఎన్నికల్లో పోటీ సిద్ధమంటున్నారు కమల్‌. విక్రమ్‌కు ముందు కమల్‌ సినిమా రిలీజై నాలుగేళ్లు అయింది. కరుణానిధి జయంతి అయిన ఈ నెల 3వ తేదీన విక్రమ్‌ విడుదలైంది. ఇది యాదృచ్ఛికమేనని, అయితే కరుణానిధి తనకు ఇష్టమైన నాయకుడన్నారు కమల్‌. రాజకీయాల నుంచి కానీ MNM పార్టీ నుంచి కానీ బ్రేక్‌ ఎలాంటి బ్రేక్‌ లేదని, వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అంటున్నారు కమల్‌ హాసన్‌.