Minor Girl Pregnancy: 16 వారాల గర్భవతిని.. అబార్షన్‌కు అనుమతి ఇవ్వండి: కోర్టులో 14 ఏళ్ల బాలిక పిటిషన్‌

|

Jan 11, 2023 | 7:46 AM

అబార్షన్‌ చేసేందుకు అనుమతి కోరుతూ ఓ మైనర్ బాలిక (14) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తాను 16 వారాల గర్భవతినని.. వైద్యపరంగా దానిని విచ్చిన్నం చేసేందుకు..

Minor Girl Pregnancy: 16 వారాల గర్భవతిని.. అబార్షన్‌కు అనుమతి ఇవ్వండి: కోర్టులో 14 ఏళ్ల బాలిక పిటిషన్‌
Minor Girl Pregnancy
Follow us on

అబార్షన్‌ చేసేందుకు అనుమతి కోరుతూ ఓ మైనర్ బాలిక (14) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తాను 16 వారాల గర్భవతినని.. వైద్యపరంగా దానిని విచ్చిన్నం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బాలిక తన తల్లి ద్వారా హైకోర్టును ఆశ్రయించింది. మైనర్ బాలుడు, బాలిక పరస్పర అంగీకారంతో గర్భం దాల్చినట్లు తన పిటిషన్‌లో పేర్కొంది. అంతేకాకుండా చిన్న వయసులో గర్భం కొనసాగిస్తే బాలిక శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని పిటీషన్‌లో ప్రస్తావించారు. ఐతే ఈ విషయంపై స్థానిక పోలీసులకు పోక్సో చట్టం కింద ఫిర్యాదు చేయడం తప్పనిసరి అయినప్పటికీ.. నేరుగా కోర్టులో పిటీషన్‌ వేయడం గమనార్హం. ప్రభుత్వ ఆసుపత్రి లేదా ఎయిమ్స్‌లో అబార్షన్‌కు అనుమతి అభ్యర్ధిస్తూ ఈ మేరకు పిటిషన్‌లో పేర్కొన్నారు. బాలిక తల్లి సమాజానికి భయపడి నేరుగా కోర్టును ఆశ్రయించినట్లు బాధితురాలి తరపు న్యాయవాది అమిత్ మిశ్రా పిటిషన్‌లో పేర్కొన్నారు.

గర్భం కొనసాగించడం వల్ల మహిళకు శారీరక, మానసిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లయితే ఎంటీపీ చట్టం ప్రకారం 20 వారాలలోపు గర్భం రద్దుకు అనుమతి ఉంటుందని పిటీషన్‌లో ప్రస్తావించారు. జనవరి 6, 2023 నాటికి బాలిక 15 వారాల 4 రోజుల గర్భంతో ఉన్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. పోక్సో చట్టం సెక్షన్ 19 ప్రకారం ఏకాభిప్రాయంతో మైనర్ గర్భం దాలిస్తే స్థానిక పోలీసులు, డాక్టర్లకు తెలియజేయడాన్ని మినహాయిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇక ఈ వ్యాజ్యం బుధవారం జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ ధర్మాసనం విచారించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.