ఏపీలో 16, తెలంగాణ‌లో 14 మంది పోలీసుల‌కు కేంద్ర‌హోంశాఖ మెడ‌ల్స్‌

ఏపీలో 16, తెలంగాణ‌లో 14 మంది పోలీసుల‌కు కేంద్ర‌హోంశాఖ మెడ‌ల్స్‌

సాతంత్య్ర దినోత్స‌వం (ఆగ‌ష్టు 15) సంద‌ర్భంగా ఉత్త‌మ సేవ‌లందించిన పోలీసుల‌కు కేంద్రం హోంశాఖ మెడ‌ల్స్‌ను అంద‌జేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా 2020 సంవ‌త్స‌రానికి గానూ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం నుంచి 16 మంది..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 14, 2020 | 6:44 PM

Police Medals to AP and Telangana States: సాతంత్య్ర దినోత్స‌వం (ఆగ‌ష్టు 15) సంద‌ర్భంగా ఉత్త‌మ సేవ‌లందించిన పోలీసుల‌కు కేంద్రం హోంశాఖ మెడ‌ల్స్‌ను అంద‌జేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా 2020 సంవ‌త్స‌రానికి గానూ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం నుంచి 16 మంది పోలీసులు, తెలంగాణ రాష్ట్ర నుంచి 14 మంది పోలీసులు ఈ మెడ‌ల్స్‌ని అందుకోనున్నారు.

కాగా ఏపీకి చెందిన 16 ప‌త‌కాల్లో.. 14 ఉత్త‌మ సేవా పోలీసు మెడ‌ల్స్, రెండు విశిష్ట సేవా ప్రెసిడెంట్ పోలీసు మెడ‌ల్స్ ఉన్నాయి. ఇక తెలంగాణ‌లోనూ ఇద్ద‌రు గ్యాలంట్రీ పోలీస్ మెడ‌ల్స్‌, ఇద్ద‌రు రాష్ట్ర‌ప‌తి పోలీస్ మెడ‌ల్స్‌, 10 మంది విశిష్ట సేవా పోలీస్ ప‌త‌కాల‌ను అందుకోబోతున్నారు.

తెలంగాణ నుంచి పురస్కారానికి ఎంపికైన వారు..

1. నాయిని భుజంగరావు, ఏసీపీ, రాచకొండ. 2. మనసాని రవీందర్ రెడ్డి, డీడీ, ఏసీబీ హైదరాబాద్. 3. చింతలపాటి యాదగిరి. 4. శ్రీనివాస్ కుమార్, ఏసీపీ, సైబరాబాద్. 5. మోతు జయరాజ్, అడిషనల్ కమాండెంట్, వరంగల్ పోలీస్ బెటాలియన్. 6. డబ్బీకార్ ఆనంద్ కుమార్, డీఎస్పీ ఇంటెలిజన్స్, హైదరాబాద్. 7. బోయిని క్రిష్టయ్య, ఏఎస్పీ, భద్రాద్రి, కొత్తగూడడెం జిల్లా. 8. కట్టెగొమ్ముల రవీందర్రెడ్డి, డీఎస్పీ, హైదరాబాద్. 9. ఇరుకుల నాగరాజు, ఇన్స్ పెక్టర్ హైదరాబాద్. 10. షేక్ సాధిక్‌ అలీ, ఎస్సై, మల్కాజ్‌గిరి.

అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ అడిష‌న‌ల్ డీజీపీ ర‌విశంక‌ర్‌తో పాటు హోంశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ కుమార్ విశ్వ‌జిత్ కూడా భార‌త రాష్ట్ర‌ప‌తి పోలీసు మెడ‌ల్ అందుకోబోతున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల‌కు సంబంధించిన 80 మందిని ప్రెసిడెంట్ పోలీస్ మెడ‌ల్స్‌కి, 215 మందిని గ్యాలంట్రీ పోలీస్ మెడ‌ల్స్‌కి, 631 మందిని విశిష్ట సేవ పోలీస్ ప‌త‌కాల‌కు కేంద్ర హోంశాఖ ఎంపిక చేసింది.

Read More:

ఈ నెల 19న ఆంధ్రప్ర‌దేశ్‌ కేబినెట్ స‌మావేశం

రూ.33ల‌కే క‌రోనా ట్యాబ్లెట్లు

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం ఇంకా అలాగే ఉందిః ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు

ప్ర‌పంచంలో ఉన్న‌ ప్రేమ‌నంతా త‌న‌పై కురిపించుః నాగ‌బాబు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu