ఇక 2021 నుంచి ఈ-పాస్‌పోర్టులు!

ఇక 2021 నుంచి ఈ-పాస్‌పోర్టులు!

2021 నుంచి ఈ-పాస్‌పోర్టులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ట్రయల్స్ లో భాగంగా మొదటగా 20,000 డిప్లమాటిక్ ఈ-పాస్‌పోర్టులు జారీ చేయనుంది. ఇందుకోసం ఐటీ సేవలందించే ఏజెన్సీని

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 14, 2020 | 4:29 PM

2021 నుంచి ఈ-పాస్‌పోర్టులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ట్రయల్స్ లో భాగంగా మొదటగా 20,000 డిప్లమాటిక్ ఈ-పాస్‌పోర్టులు జారీ చేయనుంది. ఇందుకోసం ఐటీ సేవలందించే ఏజెన్సీని ఎంపిక చేసేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. ఈ-పాస్‌పోర్టులో ఎలక్ట్రానిక్ మైక్రోప్రాసెసర్ చిప్ ఉంటుంది. దీనివల్ల ఎయిర్ పోర్టులో వేగంగా ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

గంటకు 10,000 నుండి 20,000 వరకు ఈ-పాస్‌పోర్ట్‌లను సిద్ధం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకమైన యూనిట్ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలో ఢిల్లీ, చెన్నైలలో ఐటి వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. ఈ-పాస్‌పోర్ట్‌ల జారీకి ఐటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి, ఒక ఏజెన్సీని ఎన్నుకోవటానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) తో కలిసి పనిచేస్తున్న నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ బుధవారం ఒక ప్రతిపాదన విడుదల చేసింది.

Read More:

అమరావతి రైతులకు అన్యాయం జరగదు..!

సౌండ్ పొల్యూషన్ నిబంధనలు అతిక్రమిస్తే.. రూ.లక్ష జరిమానా..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu