Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Dharmendra Pradhan: యువశక్తితో భారత్‌లో కొత్త అధ్యాయం.. ఐఆర్ఎంఏ, ఎల్ఐసీ చొరవను ప్రశంసించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Social Enterprise Conclave: ఐఆర్ఎంఏ, ఎల్ఐసీ తీసుకన్న చొరవను మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. సామాజిక సంస్థలకు సహాయం చేయడంలో ఇటువంటి సమ్మేళనం పాత్ర చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు. సామాజిక సంస్థలకు సహాయం చేయడంలో ఇటువంటి సమ్మేళనం పాత్ర చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు. యువశక్తి సహకారంతో నవ భారతం కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో యువతకు

Minister Dharmendra Pradhan: యువశక్తితో భారత్‌లో కొత్త అధ్యాయం.. ఐఆర్ఎంఏ, ఎల్ఐసీ చొరవను ప్రశంసించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Social Enterprise Conclave
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 05, 2023 | 7:12 AM

దేశాభివృద్ధిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లడంలో సోషల్ ఎంటర్‌ప్రైజ్‌దే ప్రధాన పాత్ర అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు.  ఐఆర్‌ఎంఏ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌), ఎల్‌ఐసీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌. మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సోషల్ ఎంటర్‌ప్రైజ్ కాన్‌క్లేవ్‌కు ఆయన హాజరయ్యారు. పారిశ్రామికవేత్తలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఐఆర్ఎంఏ, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించే రెండవ వార్షిక సమ్మేళనం ఇది. ఈ కార్యక్రమం మరింత మంది పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం.

ఐఆర్ఎంఏ, ఎల్ఐసీ ఈ చొరవను మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. సామాజిక సంస్థలకు సహాయం చేయడంలో ఇటువంటి సమ్మేళనం పాత్ర చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు. యువశక్తి సహకారంతో నవ భారతం కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో యువతకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు.

ఆవిష్కరణ, ఎంటర్‌ప్రైజ్ స్ఫూర్తితో యువశక్తి న్యూ ఇండియా దశగా ప్రవేశిస్తోందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మన యువత సామాజిక శ్రేయస్సు వైపు పెద్ద ప్రభావాన్ని చూపే వారి ప్రయత్నాలకు మరింత మద్దతునిస్తాయని ఆయన అన్నారు.

దేశాభివృద్ధిలో సామాజిక సంస్థలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అభిప్రాయపడ్డారు. పారిశ్రామికవేత్తలు పెద్దగా కలలు కంటారని, వారి కలలను సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని ఆయన సందేశం ఇచ్చారు. తమ కార్యక్రమాలను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్ఎంఏ డైరెక్టర్ ఉమాకాంత్ దాస్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వై విశ్వనాథ్ గౌర్ పాల్గొన్నారు. మన #యువశక్తి సంస్థ ఆవిష్కరణ, స్ఫూర్తితో కొత్త భారతదేశం కొత్త దశలోకి ప్రవేశిస్తోందని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే.. ఆస్తిలో వాటా ఆడగొచ్చా?
పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే.. ఆస్తిలో వాటా ఆడగొచ్చా?
ఎడారి దేశంలో ఈ మొక్క బంగారు గని.. మన దేశంలో పెంచే ప్రయత్నం..
ఎడారి దేశంలో ఈ మొక్క బంగారు గని.. మన దేశంలో పెంచే ప్రయత్నం..
మీరు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు..అయితే ఇలా చేయండి!
మీరు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు..అయితే ఇలా చేయండి!
అల్లు అర్జున్ బన్నీ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
అల్లు అర్జున్ బన్నీ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
మహిళ శరీరం నుంచి పంది కిడ్నీ తొలగింపు! కారణం..?
మహిళ శరీరం నుంచి పంది కిడ్నీ తొలగింపు! కారణం..?
మెడిమిక్స్‌ సోప్‌ తొలినాళ్లలో ఎందుకు తయారు చేశారో తెలుసా..?
మెడిమిక్స్‌ సోప్‌ తొలినాళ్లలో ఎందుకు తయారు చేశారో తెలుసా..?
వచ్చే మూడు రోజలు ఏపీకి రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
వచ్చే మూడు రోజలు ఏపీకి రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
పవర్‌ఫుల్‌ టూ గ్లామర్.. 2 వారాల్లో రెండు వేరియేషన్స్‌‎లో తమన్నా..
పవర్‌ఫుల్‌ టూ గ్లామర్.. 2 వారాల్లో రెండు వేరియేషన్స్‌‎లో తమన్నా..
మొదటి ఫోటో షూట్‌లో అలా.. ఇప్పుడేమో ఇలా..!!
మొదటి ఫోటో షూట్‌లో అలా.. ఇప్పుడేమో ఇలా..!!
ఏసీ గదుల్లో సిగరెట్‌ స్మోకింగ్‌ చేసే అలవాటు మీకూ ఉందా?
ఏసీ గదుల్లో సిగరెట్‌ స్మోకింగ్‌ చేసే అలవాటు మీకూ ఉందా?