వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ 2017 లో ఆంటిగ్వా, బర్భూడా దీవులకు వెళ్లేముందు..కొంతమంది డమ్మీ డైరెక్టర్లను నియమించి థాయిలాండ్ పారిపోవాలనుకున్నాడట.. తనను ఈడీ అధికారులు ఎక్కడ పట్టుకుంటారోనన్న భయంతో ఈ యోచన చేశాడని సిబిఐ తన అనుబంధ చార్జిషీట్ లో పేర్కొన్నట్టు ఎకనామిక్ టైమ్స్ పత్రిక తెలిపింది. హాంకాంగ్ లో ఉన్న తన సంస్థల్లో పని చేస్తున్నవారిని డైరెక్టర్లుగా చూపి ఇలా పలాయనం చిత్తగించాలనుకున్నాడని, ఇండియా నుంచి ఈడీ అధికారులు రావచ్చునని వారిని అప్రమత్తం చేశాడని తెలిసింది. ఈడీ అధికారులు మిమ్మల్ని ఎంక్వయిరీ చేయవచ్చునని ముందే హెచ్చరించాడని. . అందువల్లే ఎందుకైనా మంచిది మీరు బ్యాంకాక్ వెళ్లిపోవాలని కూడా ఆయన సూచించాడట. ఈ కేసులో మొత్తం 12 మంది పేర్లను సిబిఐ తన అనుబంధ చార్జిషీట్ లో ప్రస్తావించింది, చోక్సీతో బాటు పంజాబ్ నేషనల్ బ్యాంకు మాజీ అధికారి విపుల్ చిటాలియా పేరును కూడా ఇందులో చేర్చింది. హాంకాంగ్ తో సహా సింగపూర్ లో మీరు తలదాచుకోవాలని చోక్సీ తన డమ్మీ డైరెక్టర్లకు చెప్పాడట. అంటే తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపడతారని ఆయన ముందే ఊహించాడని సిబిఐ వెల్లడించింది.
అసలు ఇండియాను మీరు విజిట్ చేయవద్దని కూడా వారికి హితబోధ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం డొమినికా లో ఉన్న ఈయన అప్పగింత కోసం భారత అధికారులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. డొమినికా కోర్టులో చోక్సీ అప్పగింతపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఆయనను ఇండియాకు తీసుకువచ్చేందుకు ఇటీవల ఇక్కడి నుంచి సీబీఐ, ఈడీ సంస్థలకు చెందిన 8 మంది అధికారుల బృందం డొమినికా వెళ్లి కూడా వట్టి చేతులతో తిరిగివచ్చింది. తాను అసలు భారతీయుడిని కాదని, భారత పౌరసత్వాన్ని వదిలేసుకున్నానని ఆయన చెబుతున్నాడు. అటు ఆంటిగ్వాలో ఆయన పౌరసత్వం కేసు ఇంకా కోర్టు విచారణలో ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టెలో చిన్నారి.!మహాభారతం నాటి సీన్ మళ్లీ రిపీట్..వైరల్ అవుతున్న వీడియో :viral video.